ఈ మధ్యనే పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తమను లక్ష్యంగా చేసుకొని ఐటీ.. ఈడీలు తనిఖీలు చేసే అవకాశం ఉందని.. భారీ ఎత్తున ఇబ్బందులకు గురి చేసే వీలుందన్న మాట చెప్పటం తెలిసిందే.
దీనికి తగ్గట్లే కొద్ది రోజులుగా తెలంగాణ అధికారపక్షానికి చెందిన నేతలు.. వారి సన్నిహితులకు సంబంధించిన వ్యాపారాలు.. వ్యవహారాలకు సంబంధించి సోదాలు సాగుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి వంతు వచ్చినట్లుగా చెప్పాలి.
మంగళవారం తెల్లవారుజాము నుంచి మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లు.. ఆఫీసుల్లో ఐటీ సోదాలు భారీగా సాగుతున్నాయి. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. మల్లారెడ్డి నివాసంతో పాటు.. ఆయన కార్యాలయం.. ఆయన కుమారుడు.. అల్లుడు ఆఫీసుల్లో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల కాలంలో పలువురు ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నా.. అవేమీ కూడా ఇప్పుడు జరుగుతున్నంత భారీగా మాత్రం లేదంటున్నారు. ఏకంగా 50 టీంలు మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ.. వారి ఆఫీసుల్లోనూ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ లెక్కన మిగిలిన ముఖ్యనేతల ఇళ్లు.. కార్యాలయాల్లో ఐటీ సోదాలకు అవకాశాలు ఎక్కువన్న మాట వినిపిస్తోంది. తాజా ఐటీ సోదాలు జరుగుతున్న తీరు గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.