రష్యా వ్యాక్సిన్​పై మరో పేచీ.. డేటాలో తేడాలున్నయట!

Update: 2020-09-11 00:30 GMT
ప్రపంచంలోనే తొలిసారిగా కరోనాకు వ్యాక్సిన్​ కనిపెట్టింది మేమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్​.. స్పుత్నిక్​- వీ అనే వ్యాక్సిన్​ను ప్రకటించాడు. వ్యాక్సిన్​ను విడుదల చేయడమే కాక దాన్ని స్వయంగా తన కూతురుకే ఇప్పించి సంచలనం సృష్టించాడు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా జరుపని ఈ వ్యాక్సిన్​పై మొదటి నుంచి పలువురు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల ప్రముఖ మెడికల్ జర్నల్‌ ల్యాన్సెట్‌ రష్యాపై ఓ సంచలనాత్మక కథనం ప్రచురించింది. రష్యా వ్యాక్సిన్​పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆ వ్యాక్సిన్​ ఎంతో సేఫ్​ అని ఆ కథనంలో పేర్కొన్నారు. అంతేకాక వ్యాక్సిన్ ఇచ్చిన వారందరిలోనూ యాంటీబాడీస్​ ఉత్పత్తి అవుతున్నాయని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు.

అయితే ఆ కథనంపై ప్రస్తుతం ఇటలీ శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘స్పుత్నిక్-వి పేరుతో సమర్పించిన డేటా ను నమ్మలేం. రష్యా చెప్పినట్టు యాంటీబాడీలు ఉత్పత్తి కావడం అసాధ్యం’ అంటూ వారు ల్యాన్సెట్​ జర్నల్​ ఎడిటర్​కు ఓ లేఖ రాశారు. వలంటీర్లలో ఒకే స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు రష్యా పేర్కొనడంపై వారు సందేహం వ్యక్తం చేశారు. కాగా ఈ టీకాను రూపొందించిన గమెలేయా ఇన్‌స్టిట్యూట్ మాత్రం శాస్త్రవేత్తలు వాదనలను కొట్టిపారేసింది. ది లాన్సెట్ జర్నల్​కు చెందిన ఐదుగురు విశ్లేషకులు సమీక్షకలను పరిశీలించారని ఇన్స్​స్టిట్యూట్​ డిప్యూటీ డైరెక్టర్ డెనిస్ లోగునోవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటలీ శాస్త్రవేత్తలు ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రష్యాలో స్పుత్నిక్-వీ విడుదలైంది. ఈ వ్యాక్సిన్ సక్సెస్ నా.. ఫెయిల్యూర్ నా అనేది జనమే తేల్చనున్నారు.
Tags:    

Similar News