ఆకాశంలో ఎగరాలని అందరూ కోరుకుంటారు. కానీ, కొందరు మాత్రం ఆ సాహసం ఎలాగైనా చేసెయ్యాలని ఉవ్విళ్లూరుతారు. ఏదో ఒక పర్వత ప్రాంతానికి వెళతారు. స్కైడైవింగ్ - వింగ్ సూట్ వేసుకుని జంపింగ్ వంటి సాహసకృత్యాలు చేస్తూ ఆ సరదా తీర్చుకుంటారు! అయితే, అందరి సాహాసయాత్రలూ ఒకేలా ఉండవు. అలాంటి ఓ సాహసమే అతడి పాలిట అంతిమ యాత్రగా పరిణమించింది. వింగ్ సూట్ వేసుకుని గాల్లో తేలుతూ లోయలో దూకాలని ప్రయత్నించాడు ఒక ఇటాలియన్ పైలెట్. సోషల్ మీడియాలో తన సాహసకృత్యాన్ని లైవ్ టెలీకాస్ట్ కూడా చేయడం ప్రారంభించాడు. అయితే, వింగ్ సూట్ వేసుకుని అలా దూకాడో లేదో.. అంతే, లైవ్ ఆగిపోయింది! దాన్ని చూస్తున్న స్నేహితులూ బంధువులూ కంగారుపడ్డారు. చకచకా మెసేజ్ లు పెట్టారు. కానీ, అట్నుంచి రిప్లై రాలేదు.
ఆర్మిన్ చెమీడర్ (28) ఒక ఇటాలియన్ పైలెట్. గగన విహారం అతడికి అలవాటైన పని. కానీ, గాల్లో పక్షిలా ఎగరాలన్నది అతడి కోరిక. ఆ కోరిక తీర్చుకోవడం కోసమే స్విట్జర్లాండ్ లోని కాండెర్ స్టెగ్ అనే పర్వత ప్రాంతానికి వెళ్లాడు. వింగ్ సూటు వేసుకుని కొండపై నుంచి దూకేందుకు సిద్ధపడ్డాడు. సూటు వేసుకుని రెడీ అవుతూ సోషల్ మీడియాలో లైవ్ పెట్టాడు. కొద్ది క్షణాల్లో తాను దూకబోతున్నాననీ, చాలా ఎక్సైటింగ్ గా ఉందనీ, నాతో పాటూ మీరూ దూకండి అంటూ మాట్లాడుతూ... జంప్ చేశాడు. అంతే, కొన్ని క్షణాల్లో ఏదో పడిపోయిన శబ్దం అందిరికీ వినిపించింది. ఆ తరువాత, ఆర్మీన్ ఏమయ్యాడో ఎవ్వరికీ కనిపించలేదు.
జంపింగ్ చేసిన ప్రాంతంలో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. గాలింపులు జరిపారు. చివరికి అతడి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అయితే, ఆర్మీన్ మరణానికి గల కారణాలు ప్రస్తుతానికి చెప్పలేమనీ, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆర్మీన్ జంపింగ్ వీడియో వైరల్ అవుతోంది. దాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.
Full View