మరోసారి తన వక్రబుద్ధి చూపిన చైనా..ఏం చేసిందంటే !

Update: 2020-04-07 08:10 GMT
చైనా వక్ర బుద్ది ఎలా ఉంటుందో చెప్పడానికి తాజా సంఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది చైనాలోనే..చైనా లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన మొదట్లో చైనా తీవ్ర ఇబ్బందులని ఎదుర్కుంటున్న సమయంలో మానవతాదృక్పదంతో ఇటలీ చైనాకు వ్యక్తిగత రక్షణ సామగ్రిని (PPE)  ఉచితంగా అందించింది. ఆ తరువాత చైనా కరోనా  పై విజయం సాధిస్తే ..ప్రస్తుతం ఇటలీ కరోనాతో అల్లాడిపోతుంది.

ఈ నేపథ్యంలో తమకు ఉచితంగా పీపీఈలను ఇచ్చిన ఇటలీకి...  అవే పీపీఈలను అమ్మింది. ఈ వివరాలను స్పెక్టేటర్ మీడియా సంస్థ వెల్లడించింది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్నంతా కబళిస్తుండడంతో ఆ దేశంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, మానవతా దృక్పధంతో ఇటలీకి పీపీఈలను డొనేట్ చేస్తున్నామని తొలుత చైనా ప్రకటించింది. ఆ తర్వాత చైనా డొనేట్ చేయలేదని... వాటిని అమ్మిందంటూ పలు మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి.

దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గంలోని ఓ అధికారి మాట్లాడుతూ చైనాపై మండిపడ్డారు. ఇటలీ ఫ్రీగా ఇచ్చిన వాటిని మళ్లీ తిరిగి కొనేలా చైనా ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించారు. యూరప్ కు మహమ్మారి సోకక ముందు చైనాలో ఉన్న తన పౌరులను కాపాడుకునేందుకు ఇటలీ టన్నుల కొద్ది పీపీఈలను పంపించిందని చెప్పారు. అవే పీపీఈలను ఇటలీకి పంపించి... దాన్నుంచి సొమ్ము చేసుకుందని మండిపడ్డారు ఇకపోతే ,  ఈ కరోనా వైరస్ దాటికి ఇటలీలో మరణాల సంఖ్య 16,523కి చేరింది. అంతేకాక 132,547 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రపంచం ఏమైనా కూడా కూడా మా బుద్ది మాత్రం ఇక మారదు అని చైనా మరోసారి నిరూపించుకుంది.
Tags:    

Similar News