పవన్ కల్యాణ్ తోనే సాధ్యమవుతుందట

Update: 2019-11-26 10:52 GMT
సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీషులో బోధన చేయాలని డిసైడ్ చేసింది ఏపీలోని జగన్ సర్కారు. తెలుగును సబ్జెక్ట్ గా ఉంచుతూ.. మిగిలిన అన్ని సబ్జెక్టులు మాత్రం ఇంగ్లిషులోనే బోధించాలన్న నిర్ణయంపై కొందరు అతిగా స్పందిస్తున్న వైనం తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టాలన్న పట్టుదలతో చిత్రవిచిత్రమైన వాదనల్ని తెర మీదకు తెస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా పరిశీలించకుండానే కొందరు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపైన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని షురూ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమ్మ భాష అయిన తెలుగును కాదని ఆంగ్ల భాషలో బోధించటం సరికాదన్నది పలువురి వాదన.

ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాజాగా తెలుగు సినీ గేయ రచయిత.. సాహిత్యవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగును డెవలప్ చేసే అంశంపై తాను పవన్ తో సమావేశమయ్యాయని.. చర్చలు జరిపినట్లు చెప్పారు.

మాతృభాషాభివృద్ధి పవన్ తోనే సాధ్యమవుతుదన్నారు. పుట్టిన బిడ్డకు మాతృభాష‌లోనే అన్ని విషయాల్ని అర్థమయ్యేలా తల్లి చెబుతుందన్నారు. అందుకే అమ్మ భాష చాలా ముఖ్యమన్న ఆయన.. ఇప్పటివరకూ ముఖ్యమంత్రులుగా చేయలేని పనిని పవన్ మాత్రం చేస్తారన్న మాటను చెప్పటం గమనార్హం. ఇంగ్లిషును కేవలం ఒక భాషగా మాత్రమేనని.. దాన్ని ఆరో తరగతి నుంచి కూడా నేర్పించొచ్చన్న వాదనను పాట రూపంలో వినిపించారు. పవన్ మీద జొన్నవిత్తుల ప్రదర్శించిన నమ్మకం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News