మీ బాధ ప్ర‌పంచం బాధ అవుతుందా బాబు?- ఐవీరెడ్డి

Update: 2017-12-01 10:51 GMT
`బాబు బాధ ఇపుడు ప్ర‌పంచం బాధ‌* గా ఫీల‌వ్వాలి మనం. అలాగే ఉంది ఆయ‌న నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తుంటే...! రాజకీయాల్లో త‌న‌కంటే సీనియ‌ర్ ఎవ‌రూ లేర‌ని త‌న‌కు తాను స‌ర్టిఫికేట్ ఇచ్చేసుకునే ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు నా బాధే...ప్ర‌పంచం బాధ అంటున్నార‌ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్ద‌లూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ‌ ఇంచార్జీ ఐవీరెడ్డి విమ‌ర్శించారు.  రెండు నాల్క‌ల సిద్ధాంతానికి పెట్టింది పేర‌యిన చంద్ర‌బాబు ఏపీకి వ‌ర‌ప్రదాయిని అనే పేరున్న పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న ఆయ‌న‌లోని స్వార్థ‌పూరిత ల‌క్ష‌ణాన్ని మ‌రోమారు ప్ర‌జ‌లంద‌రికీ తెలిపింద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ప‌లు అంశాల‌ను ఐవీ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు.

-- రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరానికి జాతీయ హోదా దక్కింది. ఈ ప్ర‌కారం కేంద్రమే ఈ ప్రాజెక్టు కట్టాల్సి ఉండగా చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు?  అలా తీసుకున్న చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పోలవరం విషయంలో కేంద్రం అభ్యంతరం తెలిపింది నిజం కాదా?

-- ఒక‌వైపు పోలవరం..సోమ‌వారం అంటూ డ‌బ్బా కొట్టుకుంటూనే...ప్రాజెక్టును త‌న‌ బినామీలు - స్నేహితుల కోసం తాకట్టు పెడుతారా? టెండర్ల ప్ర‌క్రియ‌లో ఒక విధానం రూపొందించి దాన్ని పాటించకపోవడానికి కారణమేంటి?  మీ మ‌నుషుల‌కు దోచిపెట్టేందుకేనా?

--చంద్రబాబు ఈ మూడున్నరేళ్ల కాలంలో చేసిన అవినీతి - అక్రమాలు బయటపడుతున్నాయి. అందులో భాగంగానే కేంద్రం ప‌నులు నిలుపుద‌ల చేయాల‌నే ఉత్త‌ర్వులు. ఈ విష‌యాన్ని అంగీక‌రించాల్సింది పోయి...ప్రాజెక్టు భ‌విష్య‌త్తును తాక‌ట్టు పెట్టేలా ప‌నులు ఆపేస్తాం..కేంద్రానికి ఇచ్చేస్తాం అన‌డంలో మ‌ర్మం ఏంటి? బ‌్లాక్ మెయిలే క‌దా!

- ఇప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌స్తావిస్తున్న మీరు...ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హోదా గ‌ళం విప్పితే... అరెస్టుల ప‌ర్వంతో ప్ర‌జ‌ల ప‌క్షాన ఉన్న గ‌ళాన్ని అణిచివేశారు. ప్ర‌త్యేక ప్యాకేజీ శ‌ర‌ణ‌మ‌న్నారు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ హోదా జ‌పం చేస్తున్నారు. అంటే...మీ ఆలోచ‌న ప్ర‌కారం - మీ అవ‌స‌రాల ప్ర‌కారం ప్ర‌జ‌లు న‌డుచుకోవాలా?  స్వ‌లాభం కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు తాక‌ట్టుపెట్టినా...మీకు భ‌జ‌న చేయాలా?

-- ప్ర‌జ‌లు అడిగిన‌ప్పుడు..ప్ర‌తిప‌క్ష నేత అడిగిన‌ప్పుడు...ఆఖ‌రికి మీ మిత్రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు తెలిపిన‌పుడు గుర్తుకు రాని ప్ర‌త్యేక హోదా ఇప్పుడు ప్ర‌స్తావించ‌డం వెనుక‌...రాజకీయం ఏంటి? ఆనాడు మోడీ జోడీతో తిరుగులేద‌నుకున్న స్థితి నుంచి ఇప్పుడు ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న  వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించ‌డ‌మేనా?

- విభజన చట్టంలోని అంశాలను సాధించేందుకు ఇప్ప‌టికే మూడున్న‌రేళ్లు పూర్త‌య్యాయి. ఇంకా ఏడాది మాత్రమే మీకు అవకాశం ఉంది. పైగా ముంద‌స్తు ఎన్నిక‌ల జ‌పం చేస్తున్న మీరు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఎప్పుడు పోరాటం చేస్తారు?  మీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌లు స‌రైన స‌మ‌యంలో స‌రైన రీతిలో స్పందించ‌డం ఖాయం.
Tags:    

Similar News