తన తనయుడి తీరులో లోటు పాట్లను సరిచేయలేనని నిర్ధారించుకున్నాకా.. అతడిని మందబుద్ధిని, నాలుక మందాన్ని కవర్ చేయడానికి ఏకంగా సోషల్ మీడియాపై విరుచుకుపడటం మొదలుపెట్టిన తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వినాశబుద్ధితో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నాడు. మొన్న రవికిరణ్ ఇంటూరి, ఇప్పుడు రవీంద్ర ఇప్పాల. లోకేష్ బాబును పప్పు అన్నారని చెప్పి.. రవికిరణ్ ఇంటూరిని వేధిస్తున్నారు, ఇక తన అభిప్రాయాలను సూటిగా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం రవీంద్ర ఇప్పాల తప్పుగా చూపుతున్నారు ఏపీ పోలీసులు.
హింసించే రాజు ఇరవై మూడవ పులకేశి లాంటి లోకేష్ ఆదేశాలను అమలు చేయడంలో రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నామని పోలీసులు కూడా గ్రహిస్తే మంచిది. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాంటి పౌర హక్కుకు భంగం కలిగిస్తున్నారు చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ బాబు. తమ చేతిలోని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లు తమకు లోటు పాట్లను ఎంచిన వారిని జైలుకు పంపుతున్నారు. భయభ్రాంతులకు గురిచేసే యత్నం చేస్తున్నారు.
వీరి నియంతవైఖరి ఫలితంగానే రవికిరణ్, రవీంద్ర ల అరెస్టులు జరిగాయి. ఇలా కొంతమంది యాక్టివ్ యూజర్లను భయభ్రాంతులకు గురి చేస్తే తమకు శాపంలా పరిణమించిన సోషల్ మీడియా మొత్తం దారికి వస్తుందని లోకేష్ భావిస్తూ ఉండవచ్చు. ఆయన మందబుద్ధి అంతకు మించిన మేధస్సును కలిగి ఉండదు కదా? సోషల్ మీడియా అనేదొక సునామీ అని లోకేష్ అర్థం చేసుకుంటే మంచిది. ఒకరిద్దరినీ లేదా.. మరో వంద మందిని ఒక్కొక్కరిగా అరెస్టులు చేస్తూ పోయినా, వారిని బెదిరించో, బతిమాలో ఆపాలని చూసినా... సోషల్ మీడియా ను ఆపడం లోకేష్, చంద్రబాబుల తరం కాదు.
అయినా వారు ఈ దుస్సాహసానికి ఒడికడుతున్నారంటే.. వారి భయాందోళనలే అందుకు కారణం. పతనావస్థలో కొట్టుమిట్టాడుతూ.. ఇలాంటి నియంత పోకడలకు పోతున్నారు ఈ తండ్రీ కొడుకులు. వినాశకాలే విపరీత బుద్ధి. ఒకవైపు తమపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన వారిపై ఈ తరహా బెదిరింపుకాండలకు దిగుతున్న ఈ తండ్రీ కొడుకులు.. ఇదే సమయంలో ప్రతిపక్షాన్ని, వైఎస్ కుటుంబాన్ని కించపరుస్తూ పోస్టులు పెట్టిస్తున్నారు. అలాంటి వారిపై ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదులు చేసినా.. ఫలితం లేదు.
రాష్ట్రం తమ కుటుంబం జాగీరు అని చంద్రబాబు, లోకేష్ లు భావిస్తున్నారు. అయితే ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లు కోరి తమ పతనాన్ని కొని తెచ్చుకుంటే.. వారు అనుభవించబోయే దానికి వారే బాధ్యులు అవుతారు. తాము చక్రవర్తులమనో, నియంతలమనో.. అనుకొంటున్నట్టుగా ఉన్నారు. కానీ.. వారి అధికారం మరో ఇరవై నెలలు మాత్రమే. అప్పుడు రాజెవరో రౌతెవరో ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవైపు వేదాంతం పలికే చంద్రబాబు నాయుడు.. మొత్తం మీడియా చేతిలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు భయపడుతూ.. తన పాలన తీరు ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నాడు.
నిజాలు నిక్కచ్చిగా వ్యక్తం అయ్యే సోషల్ మీడియాను కట్టడి చేయాలని చూస్తున్నాడు. అయితే అదొక సముద్రం.. దాన్ని కదిలిస్తే వచ్చేది సునామీనే. అయితే లోకేష్ కోసం చంద్రబాబు ఎంతగా పతనం అయిపోవడానికి అయినా సిద్ధంగానే కనిపిస్తున్నాడు. దీనికి ప్రతిఫలాన్ని అనుభవించడం తథ్యం. అరెస్టులు అనే తాటాకు చప్పుళ్లతో తాము తమ పరువును పోగొట్టుకోవడమే తప్ప.. బెదిరించగలిగేది, సాధించగలిగేదీ ఏమీ లేదని చంద్రబాబు, ఆయన కొడుకులు గ్రహించగలిగితే వారికే మంచిది.
-ఐవీ రెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం జిల్లా.