దివంగత సీఎం - మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలు ఉన్న అన్ని చోట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. తెలుగు నాట అన్ని ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో వైఎస్ హయాంలో కొనసాగిన సంక్షేమ పాలనను ఆయా పార్టీల నేతలు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన సంక్షేమ పాలన... వైఎస్ కు జనం మదిలో చెరిగిపోని ముద్రను వేసిందని కూడా వారు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు నేతలు - యువత వైఎస్ ను స్మరించుకున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో వైఎస్ జయంతి వేడుకలు జరిగాయి.
బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కొనసాగుతున్న వైసీపీ నేత వి. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఐవీ రెడ్డి యూత్ కార్యకర్తలు వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నగరంలోని అనాథ - వికలాంగ బాలికల పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఐవీ రెడ్డి యూత్ సభ్యులు పిల్లలకు మిఠాయిలు - పండ్లు పంపిణీ చేశారు. తదనంతరం అన్నదానం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ సంక్షేమ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వైఎస్ ఆశయాలను - ఆదర్శాలను కొనసాగించేందుకు తాము వైసీపీలో కొనసాగుతున్నామన్నారు.
ఇందుకోసమే తాము వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాటలో పయనిస్తున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఐవీ రెడ్ది ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క గిద్దలూరులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ పటిష్టతకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో వి. విజయరాఘవరెడ్డి - బి.మనోహర్ రెడ్డి - అలీ - హర్షవర్ధన్ రెడ్డి - పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు - వైసీపీ నేతలు - కార్యకర్తలు పాల్గొన్నారు.