ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్ గోల్కొండ కోటను సందర్శించే సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు అనంతరం అక్కడ బాంబు ఉంచినట్లు బెదిరింపు కాల్ రావడంతో ఇవాళ గోల్కొండలో ఇవాంకా సందర్శనపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరవడం ఆసక్తికరంగా మారింది.
గోల్కొండ కోటను ఇవాంక సందర్శించారు. దాదాపు గంట సేపు గోల్కొండ కోటను సందర్శించారు. గోల్కొండ విశేషాలను ఆమెకు వివరించేందుకు ఇద్దరు గైడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆమె తిరిగేందుకు ప్రత్యేకంగా రెండు బ్యాటరీ కార్లను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో గోల్కొండకు వచ్చిన ఇవాంక.. సుమారు 40 నిమిషాల పాటు కలియతిరిగారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఇవాంక తిలకించారు. హైదరాబాద్, గోల్కొండకోట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శించిన లఘు చిత్రాన్ని ఆమె వీక్షించారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలిపే డిజిటల్ ప్రదర్శనను ఇవాంక తిలకించారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ఇవాంక.. రాణిమహాల్‌ను కలియతిరిగారు. కోట సందర్శన అనంతరం ఇవాంక ట్రైడెంట్ హోటల్‌కు బయల్దేరి వెళ్లారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గోల్కొండ కోటకు వెళ్లకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎంకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాంకతో పాటు సీఎస్ ఎస్పీ సింగ్ వెళ్లారు. కాగా, గ్లోబల్ ఎంటర్ పెన్యూర్ సమ్మిట్( జీఈఎస్)కు విచ్చేసిన ప్రతినిధులకు ఈ రోజు గోల్కోండ కోటలో ఏర్పాటు చేసిన విందు కారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నార్సింగ్ నుంచి రాందేవ్ గూడ మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే వాహనాలు బాపూఘాట్, లంగర్ హౌజ్ మీదుగా ఫతేదర్వాజ్ వైపు మళ్లించారు. అలాగే షేక్ పేట్ నుంచి గోల్కొండ వైపు వెళ్లే వాహనాలను ఫోర్ట్ క్లబ్ నుంచి జమాలీ దర్వాజ్ వైపు మళ్లించారు..