హైదరాబాద్ వేదికగా సాగుతున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ హైదరాబాద్ వాసులను అనూహ్యవార్తలకు వేదికగా మారగా...ఇప్పుడు అమెరికన్లను సైతం అదే రీతిలో ఆశ్చర్యపోయే రీతిలో చేస్తుందనే వార్తలు తెరమీదకు వచ్చాయి. అమెరికన్ ఉన్నతాధికారులు చీలిక వచ్చేందుకు సైతం ఈ సదస్సు కారణంగా మారిందని అంటున్నారు. అందులోనూ ఏకంగా వైట్‌హౌస్ పెద్దల్లో ఈ చీలిక వచ్చిందంటున్నారు. హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ఇవాంకా ట్రంప్ వెంట సీనియర్ దౌత్యవేత్తలను పంపకూడదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి రిక్స్‌టిల్లర్‌సన్ నిర్ణయించినట్టు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయని సీఎన్‌ఎన్ వార్తాసంస్థ పేర్కొంది.
ఇవాంకాను బలపరచడం ఇష్టం లేని టిల్లర్‌సన్.. డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ స్థాయికి మించిన సిబ్బందిని సదస్సులో పాల్గొనేందుకు అనుమతించలేదని తెలిపింది. గతంతో పోల్చితే విదేశాంగశాఖ పనితీరు భిన్నంగా ఉందని, టిల్లర్‌సన్ బృందానికి చెందిన వ్యక్తులు.. సీనియర్ అధికారులపై కూడా నోరుపారేసుకుంటున్నారని, టిల్లర్‌సన్ వైఖరి సరిగాలేదని పేర్కొంది. అమెరికా తరఫున అత్యున్నత దౌత్యవేత్తగా ఇవాంకా ఉండటం టిల్లర్‌సన్‌కు నచ్చడంలేదని, విదేశాంగశాఖ నుంచి సీనియర్ అధికారులకు అనుమతివ్వకపోవడంతో ఈ విషయం స్పష్టమైందని తెలిపింది.
ఈ ఏడాది జీఈఎస్ సదస్సుకు సంబంధించి విదేశాంగశాఖ బడ్జెట్‌లో కోత విధిస్తున్నట్టు వైట్‌హౌస్ టిల్లర్‌సన్‌కు తెలిపిందని వెల్లడించింది. తాత్కాలిక అసిస్టెంట్ సెక్రటరీ అలిస్ వెల్స్ హాజరుకావాల్సి ఉండగా... టిల్లర్‌సన్ బృందం ఆయనను హాజరుకాకుండా తప్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయని సీఎన్‌ఎన్ పేర్కొంది. అయితే ఈ కథనాన్ని ఇవాంకా ట్రంప్ ప్రతినిధి ఖండించారు.