హైద‌రాబాద్ టూర్‌లో...చీర‌క‌ట్టులో ఇవాంకా

Update: 2017-11-25 08:08 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ పర్య‌ట‌న తేదీ స‌మీపిస్తున్న కొద్ది ఆమె ప‌ర్య‌ట‌న‌పై ఆసక్తిక‌ర‌మైన చర్చోప‌చ‌ర్చ‌లు, అంచనాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా మరో రెండ్రోజుల్లో హైదరాబాద్‌లో అడుగుపెడుతున్న ఇవాంకా ట్రంప్ ఏం ధ‌రించ‌నున్నారు. భారత సంప్రదాయం ప్రకారం చీర కట్టుకుంటారా? మోడ్ర‌న్ డ్రెస్ ధరిస్తారా? అంటూ హాట్ హాట్ చ‌ర్చ సాగుతోంది. గ‌త సంప్ర‌దాయం పాటిస్తే...ఇవాంకా చీర క‌ట్టుకోవ‌చ్చున‌ని అంటున్నారు.

వృత్తి రీత్యా ఫ్యాషన్ డిజైనర్‌ అయిన ఇవాంకాకు స్టైల్ అనే బ్రాండ్ ఉంది. ఈ బ్రాండ్ నుంచి ఏటా ఓ కలెక్షన్ విడుదలవుతోంది. దీనికితోడు ఇవాంకా ఎప్పుడూ అమెరికన్ డిజైనర్లు రూపొందించిన దుస్తులనే ధరిస్తుంటారు. అయితే ఇటీవల జపాన్‌లో జరిగిన వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ విమెన్ (వావ్) సదస్సులో ఆమె జపాన్ సంప్రదాయ దుస్తులు ధరించారు. విదేశీ పర్యటన సమయంలో ఆమె ఇక్కడి సంప్రదాయ దుస్తులు ధరిచడం ఇదే తొలిసారి. ఇప్పుడూ ఆ ఒర‌వ‌డిని కొసాగిస్తే...ఇవాంకా చీర క‌ట్టుకోవ‌చ్చున‌ని అంటున్నారు. కాగా హైదరాబాద్‌లో కాలుమోపనున్న ఇవాంకా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పోచంపల్లి పట్టుచీరను నేయిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇవాంకా ఈ చీర‌ను ధ‌రించ‌నున్నార‌ని అంచ‌నా వెలువ‌డుతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చే విందులో ఇవాంకా ఈ చీరను ధరించి పాల్గొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గోల్కొండ సందర్శన సమయంలో ఆమె చీర ధరించకపోవచ్చని అంటున్నారు.

మ‌రోవైపు విదేశీ ప్ర‌తినిధులు హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు...చీర క‌ట్టుకోవ‌డమ‌నే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించార‌ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. ఈ లెక్క‌న ఇవాంకా సంప్రదాయ చీరకట్టులో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News