జూన్ 2. తెలంగాణ అవతరణ దినోత్సవం.. నవ్యాంధ్ర ఏర్పడ్డ రోజు.. ఈరోజు తెలంగాణలో సంబరాలు చేసుకుంటుంటుండగా.. ఏపీలో మాత్రం విభాజిత ఆంధ్రకు అన్యాయంపై దీక్షలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం నవనిర్మాణ దీక్షకు కూర్చొని ఏపీకి జరిగిన అన్యాయంపై గొంతెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న నవనిర్మాణ దీక్షపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు మండిపడ్డారు. నవనిర్మాణ దీక్ష పేరిట చంద్రబాబు గత నాలుగేళ్లుగా నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు.
శనివారం ట్విట్టర్ వేదికగా కృష్ణరావు.. చంద్రబాబు నవనిర్మాణ దీక్షపై ఘాటు విమర్శలు చేశారు. నవనిర్మాణ దీక్ష పేరిట టీడీపీ తమ లోపాలను - అసమర్ధతలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మొన్నటివరకు తప్పంతా కాంగ్రెస్ దే అన్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నవ నిర్మాణ దీక్ష పేరిట బీద అరుపులు అరవాల్సిన అవసరం లేదన్నారు. ప్రకాషం పంతులు, పొట్టి శ్రీరాములును స్ఫూర్తిగా తీసుకొని ఏపీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఐవైఆర్ సూచించారు.