అధికారపక్షంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసిన ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఉదంతం రాజకీయ వర్గాల్లోనూ.. విడిగానూ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఐవైఆర్ పోస్టుల ముచ్చట పాపులర్ అయ్యాక.. ఆయనపై సోషల్ మీడియాలో ఎదురుదాడి భారీగా పెరిగిపోయింది. ఆయన్ను అవమానిస్తూ.. అవహేళన చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెట్టటం పెరిగింది. దీంతో.. ఆయన తెగ ఫీలవుతున్నారు. తన ఇమేజ్ ను ఇంత డ్యామేజ్ చేస్తారా? అంటూ సీరియస్ అయిన ఆయన.. తన పాత పరిచయంతో రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహనన్ అపాయింట్ మెంట్ కోరారు.
తన మీద దారుణంగా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ ను ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. కొందరు తనను టార్గెట్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారని.. ఇలాంటి వారికి చెక్ చెప్పేందుకు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఐవైఆర్ మాటలకు గవర్నర్ నరసింహన్ కాస్త భిన్నంగా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారు.. వాటిని చూపెట్టిన వారు మురుగు స్థాయి వ్యక్తులని.. అలాంటి వారి చేష్టలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పని చేసిన మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమిటంటూ ఉద్బోద చేసినట్లుగా తెలుస్తోంది.
డ్రైనేజీ స్థాయి వ్యక్తులు చేస్తున్న వాటి గురించి ఆలోచించటం ద్వారా మీ స్థాయిని తగ్గించుకుంటారా? అంటూ ప్రశ్నించి.. ఐవైఆర్ ను డిఫెన్స్ లో పడేశారని చెబుతున్నారు. ఇలాంటి విషయాల్ని పట్టించుకోకుండా.. రంగారెడ్డి జిల్లా బొల్లారంలో రాజాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ డెవలప్ మెంట్ కోసం తీసుకోవాల్సిన అంశాలపై మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న సూచనను ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. తాను వచ్చిన పనిని వదిలేసిన ఐవైఆర్.. గవర్నర్ మాటలతో సమాధానపడి రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ ను చూసినప్పుడు ఎవరిని ఎలా డీల్ చేయాలో గవర్నర్ నరసింహన్ కు బాగానే వచ్చన్న విషయం అర్థమవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/