ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మరోమారు ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ర్టాల మధ్య విబేధాలకు ఇటు కేంద్ర ప్రభుత్వం అటు చంద్రబాబు సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం కారణమని ఐవైఆర్ వెల్లడించారు. ఇటీవలే నవ్యాంధ్ర మై జర్నీ అనే పుస్తకం రాసిన ఐవైఆర్ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు గురించి పలు కీలకమైన విషయాలను వెల్లడించారు. ఇరు రాష్ర్టాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్రం తీసుకోవాల్సినంత చొరవ తీసుకోలేదని - అలా చేసి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవని ఆ ఇంటర్వ్యూలో ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన సమయాన తెలంగాణలో చిమ్మచీకట్లు నెలకొన్నాయి. ``విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) అమలు చేసి తీరాల్సిందే. కానీ రాజకీయంగా ఆ ఒప్పందాలను అమలుచేయరాదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంతో రెండు రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటి ప్రభావం ఇరు రాష్ర్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం విషయంలోనూ కనపడింది` అని ఆయన అన్నారు.
రెండు రాష్ర్టాల మధ్యన మనస్పర్థలు ఎందుకు ఏర్పడ్డాయి? ఎక్కడ ప్రారంభం అయ్యాయి అనే ప్రశ్నకు ఐవైఆర్ విపులంగా స్పందించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను అమలు చేయరాదని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ స్పర్థలకు పునాది అని ఆయన స్పష్టం చేశారు. ``అప్పటి పరిస్థితుల్లో పీపీఏలను చట్టపరంగా ఆ ఒప్పందాలను అమలు చేసి తీరాలి. కానీ అమలు చేయలేదు. ఈ నిర్ణయం రెండు రాష్ర్టాల మధ్య పెద్ద అంతరం ఏర్పడేలా చేసిందని నా అభిప్రాయం. షెడ్యూల్ 10 - షెడ్యూల్ 9కి సంబంధించిన సమస్యల కంటే ముందుగా.. మొట్టమొదటగా మనస్పర్థలు రావడానికి విద్యుత్ అంశమే కారణం. రాష్ట్రం విభజన అయిన వెంటనే సెక్షన్ 8 - విద్యుత్ అంశాలు ముఖ్యమైనవి. వీటిలో సెక్షన్ 8పై ఏపీ స్పష్టమైన విధానంతో ఉన్నది. ఆ విధానానికి కేంద్రం ఒప్పుకోలేదు. గవర్నర్ కూడా ఆ విధానానికి అనుకూలంగా లేరు. అందుకే అది అక్కడ ఆగిపోయింది.`` అని తెలిపారు. విభజన తర్వాత పీపీఏల అమలు విషయమై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పానని పేర్కొన్న ఐవైఆర్ తదితర నిర్ణయం సీఎందే కాబట్టి అది అమలు కాలేదన్నారు.
ఏపీ ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించి ఉంటే రెండు రాష్ర్టాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండేందుకు అవకాశముండేదని ఐవైఆర్ అన్నారు. ``పీపీఏల చట్ట ప్రకారం అమలు చేయాల్సిందే అని నేనంటే.. ఆయన కాదన్నారు. అమలు చేయరాదని రాజకీయంగా నిర్ణయించినట్టు చెప్పారు. నన్ను అడ్డురావద్దనడంతో నేను మారుమాట్లాడలేక పోయాను. నా పని చూసుకుని వెనక్కి వచ్చేశాను. దీనికి కారణాలేమిటో నేను రాసిన నవ్యాంధ్ర మై జర్నీ అనే పుస్తకంలో వివరించే ప్రయత్నం చేశాను. ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చి ఉంటారో విశ్లేషించాను`` అని తెలిపారు. గవర్నర్ వద్ద ఇరు పక్షాల సమావేశం జరిగిందని అయితే - ఆ తర్వాత దానిపై ఎవరూ రాజకీయంగా దృష్టి సారించలేకపోయారని ఐవైఆర్ వెల్లడించారు. ఓటుకు నోటు కేసు తెరమీదకు రావడం ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడంతో చర్చలు ముందుకు సాగలేదన్నారు.