నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్ ను తీర్చిదిద్దే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాచరణను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోమారు తప్పుపట్టారు. గతంలో రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ప్రణాళికలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆయన ఆక్షేపించిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం కోసం రాజమౌళి లాంటి దర్శకులను సంప్రదించడం ఏమిటని - అసలు రాజధాని నిర్మాణానికి దర్శకులెందుకని గతంలో ఐవైఆర్ సూటిగా ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం అంటే సినిమా సెట్టింగులా అని నిలదీసిన ఐవైఆర్ డిజైన్ల ఖరారులోనే ఇంత సుదీర్ఘ సమయం గడిచిపోతే...ఇక నిర్మాణం ఎప్పుడవుతుందని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇదే రీతిలో తాజాగా మరో అంశాన్ని ప్రస్తావించారు. అయితే గతంలో వలే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా విలేకరుల సమావేశంలో కాకుండా...ట్విట్టర్ లో బాబుపై పంచ్ లు పేల్చారు.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేసి వచ్చిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను లింక్ చేస్తూ ఐవైఆర్ రెండు ట్వీట్లు చేశారు. ``అయినను పోయిరావలయు హస్తినకు. పోవటం రావటం అయిపోయింది. ప్రజల మానసమందు గల్గు అనుమానం తీర్చాల్సిన అవసరముంది. ప్యాకేజీని ఆమోదించి ఎఫ్.ఆర్.బీ.య.మ్. పరిమితుల నుంచి మినహాయించాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్రం దానికి అంగీకరించి యస్.పీ.వీ.ని ఏర్పాటు చేసుకోమన్నది. మరి ఎస్పీవీ ఏర్పాటు చేసుకుని కేంద్రం నుంచి రావలసిన 16 వేల కోట్లు రాష్ట్రం రాబట్టుకుంటుందా లేక ప్రత్యేక హోదా ఇచ్చిన దాకా ఏమీ ముట్టము అని భీష్మించుకొని కూర్చుంటుందా? నా దృష్టిలోఎస్.పీ.వీ. ఏర్పాటుచేసుకుని నిధులను సాధించి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా ఉద్యమించడమే ఉత్తమం.`` అంటూ చంద్రబాబు డైలామాలో పడే కామెంట్లు చేశారు. చంద్రబాబు ముందున్న మార్గాలేంటో పేర్కొంటూనే..అవి ఫలించాలంటే ఏం చేయాలో కూడా ఐవైఆర్ పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే బాబు లోపాలను ఎత్తిచూపడం ద్వారా పలువురి దృష్టిని ఆకర్షించిన మాజీ సీఎం....తాజాగా ఆయనకు ఉద్యమ కార్యాచరణను సూచించడం కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.