ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు... టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని అంత ఈజీగానే వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలు పరిపాలనా వ్యవహారాలకు సంబందించి బాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగిన ఐవైఆర్... బాబును నిజంగానే తీవ్రంగా ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ సర్కారుకు అన్నీ తానే వ్యవహరించిన ఐవైఆర్... పరిపాలనా యంత్రాగం హైదరాబాదు నుంచి అమరావతికి తరలివచ్చేందుకు తనవంతు కృషి చేశారనే చెప్పాలి. అసలు ఐవైఆర్ కృషి కారణంగానే అధికారులు, ఇతర సిబ్బంది అమరావతి వైపు అడుగులు వేశారంటూ సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబే కితాబిచ్చిన వైనం మనం మరిచిపోలేం. ఆ కారణంగానే సీఎస్‌గా పదవీ విమరణ పొందిన వెంటనే ఐవైఆర్‌ను రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రబాబు నియమించారు.
అయితే చంద్రబాబు పాలనపై ఏదో ఓ చిన్న కామెంట్ చేశారని, అది కూడా సోషల్ మీడియా వేదికగా చేశారన్న కారణంగా చంద్రబాబు సర్కారు ఐవైఆర్‌ను అవమానకర రీతిలో బయటకు పంపేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనో వేదనకు గురైన ఐవైఆర్... చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న పరిపాలనా తీరుపై తనదైన రీతిలో విరుచుకుపడటం ప్రారంభించేశారు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకు వచ్చిన ఐవైఆర్... చంద్రబాబు సమాధానం చెప్పలేని ప్రశ్నలెన్నింటినో సంధించేశారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై దాడి మొదలెట్టిన ఐవైఆర్... తనదైన శైలి సెటైరిక్ దాడిని షురూ చేశారనే చెప్పాలి. ఇటీవలే ట్విట్టర్ వేదికగా చంద్రబాబు సర్కారు చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ ఐవైఆర్ సంధించిన ట్వీట్లు ఇప్పుడు పెద్ద కలకలంగానే మారిపోయాయని చెప్పాలి. అసలు గడచిన ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం దక్కడం వెనుక కాపులతో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారని ఐవైఆర్ పేర్కొన్నారు. తనను అధికారంలోకి తెచ్చే విషయంలో కీలకంగా వ్యవహరించిన ఈ రెండు సామాజిక వర్గాలను చంద్రబాబు సర్కారు మాబాగా చూసుకుంటోందని ఆయన తనదైన వ్యంగ్యాన్ని రంగరించి ట్వీట్లకు ఫుల్ కలరింగ్ ఇచ్చేశారు.
తాను సీఎం కావడానికి సహకరించిన కాపులు, బ్రాహ్మణులను చంద్రబాబు సర్కారు చాలా బాగా చూసుకుంటోందని, బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఏకంగా ఆరు నెలల పాటు ఎండీ లేకుండానే కొనసాగిందని, ఆరు నెలల తర్వాత పద్మను ఎండీగా నియమించిన సర్కారు... వెనువెంటనే ఆమెను అక్కడి నుంచి బదిలీ చేసి అదే శాఖ బాధ్యతలను అదనంగా అప్పజెప్పిందని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పేందుకు ఈ ఉదంతం చాలునని ఐవైఆర్ ఎద్దేవా చేశారు. ఇక కాపుల విషయాన్ని కూడా ప్రస్తావించిన ఐవైఆర్... వెయ్యి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే కాపుప కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చంద్రబాబు సర్కారు ఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారికి అప్పగించి... కాపుల సంక్షేమంపై తనకెంత శ్రద్ధ ఉందో ఇట్టే చెప్పేసిందని సెటైర్లు సంధించారు. వెయ్యి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే కాపు కార్పొరేషన్ ఎండీ పదవికి చంద్రబాబుకు కనీసం ఒక్కరంటే ఒక్క ఐఏఎస్ అధికారి కూడా దొరకలేదని కూడా ఐవైఆర్ తనదైన మార్కు పంచ్ డైలాగులు సంధించారు. మొత్తానికి వ్యంగ్యంతో కూడిన ట్వీట్లతో ఐవైఆర్... చంద్రబాబు పాలనను కడిగిపారేశారన్న వాదన వినిపిస్తోంది.
==