నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయడంపై మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు మరోమారు తన గళం విప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణానికి తగిన రీతిలో అడుగులు వేయడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు వైఖరి నిర్లక్ష్యంగా ఉందని ఐవైఆర్ ఆరోపించారు. మొదటి నుంచి సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే రాజధాని నిర్మాణం ముందుకు సాగడం లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్పష్టత లేకపోవడమా లేదా మరేదైన కారణం కావచ్చు కానీ... అమరావతి విషయంలో అస్పష్టత కనిపిస్తోందని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం కోసం రాజమౌళి లాంటి దర్శకులను సంప్రదించడం ఏమిటని ఆయన తప్పుపట్టారు.అసలు రాజధాని నిర్మాణానికి దర్శకులెందుకని సూటిగా ప్రశ్నించారు. ముందు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఆయన సూచించారు. రాజధాని నిర్మాణం అంటే సినిమా సెట్టింగులా అని ఐవైఆర్ ప్రశ్నించారు. డిజైన్ల ఖరారులోనే ఇంత సుదీర్ఘ సమయం గడిచిపోతే...ఇక నిర్మాణం ఎప్పుడవుతుందని ఐవైఆర్ ప్రశ్నించారు.
మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బృందం దుబాయ్ పర్యటన ముగించుకుని లండన్ చేరుకుంది. ముందుగా లండన్ రవాణా వ్యవస్థను చంద్రబాబు బృందం పరిశీలించనుంది. అనంతరం నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో అమరావతి రాజధాని ఆకృతులపై సమాలోచన చేయనుంది. ఇప్పటికే మూడు డిజైన్లకు నెటిజన్లు తమ రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.