చంద్రబాబు పాలన కి.. జగన్ పాలన కు స్పష్టమైన తేడా ఉందని మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదేనని జగన్ కు సపోర్టు చేశారు. అయితే అధికార వికేంద్రీకరణ అనేది మాత్రం మంచిది కాదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండూ ఒకేచోట ఉండాలని.. శాఖల హెచ్వోడీ కార్యాలయాలు మాత్రం జిల్లాల్లో ఉంటే బెటర్ అంటూ సూచించారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు వదిలేస్తే భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు.
జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కనపెట్టి పూర్తి స్థాయి లో పాలన పాలన మీద ఫోకస్ చేస్తే జగన్ కు తిరుగు ఉండదని ఐవైఆర్ సూచించారు. సంక్షేమ పథకాల తో సమానంగా అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు అందిస్తే వైసీపీ ప్రభుత్వానికి భవిష్యత్ ఉంటుందని ఐవైఆర్ అన్నారు.
ఇక తాను బీజేపీ ని వీడనంటూనే జగన్ పాలన పై ప్రశంసలు కురిపించారు. వైసీపీ లో చేరిక పై మాత్రం ఐవైఆర్ పరోక్షం గా ఆసక్తి చూపించడం విశేషం. జగన్ తో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని ఐవైఆర్ చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి బాబు ఆఫర్ చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి జగన్ గనుక ఇస్తే ఈయన చేరినా చేరవచ్చనే సంకేతాలు పంపారు.మరి ఐవైఆర్ అభిప్రాయం పై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది వేచి చూడాలి.