గ్లోబల్ స్టార్, ప్రముఖ యాక్షన్ హీరో జాకీ చాన్ కమ్యూనిస్టు పార్టీలో చేరబోతున్నారా? ఆయన అడుగులు అటువైపే పడుతున్నాయా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ముందు నుంచీ చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగానే ఉంటున్న జాకీచాన్.. త్వరలో ఆ పార్టీలో అధికారికంగా చేరబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.
చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ధి వేడుకలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన ప్రసంగంపై సినీ ప్రముఖుల మధ్య ఓ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా మాట్లాడిన జాకీచాన్.. పార్టీలో చేరాలనే తన మనసులోని మాటను కూడా బయటపెట్టారట. ఈ మేరకు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
కమ్యూనిస్టు పార్టీ విధానాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పిన జాకీచాన్.. సీపీసీ గొప్పదనం ఏంటన్నది మన కళ్ల ముందే కనపడుతోందని అన్నారట. ఏం చెబుతుందో అదే చేస్తుందని, వాటిని తప్పక నెరవేరుస్తుందని కూడా అన్నారట. అంతేకాకుండా.. తాను కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిని కావాలని కూడా కోరుకుంటున్నట్టు జాకీచాన్ అన్నారని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
కాగా.. జాకీ చాన్ హాంకాంగ్ లో ఉంటారు. ఈ ప్రాంతం చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తమకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఈ ప్రాంత వాసులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ.. చైనా మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఇది చైనాలో అంతర్భాగం అని చెబుతోంది. టిబెట్ సైతం చైనాలో భాగమేనని వాదిస్తోంది. అయినప్పటికీ.. జాకీచాన్ చైనాకు మద్దతు పలకడం పట్ల స్థానికంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పడు ఆయన ఏకంగా కమ్యూనిస్టు పార్టీలో చేరాలని భావిస్తున్నట్టుగా వార్తలు రావడం గమనార్హం. ప్రస్తుతం జాకీచాన్ చైనా ఫిలిం అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.