గుజరాత్ ఎన్నికల్లో రవీంద్ర జడేజా భార్య ఘనవిజయం..

Update: 2022-12-08 13:11 GMT
మోకాలి గాయంపేరుతో బంగ్లాదేశ్ పర్యటన ఎగ్గొట్టి మరీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్యను గెలిపించుకున్నాడు టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా. పూర్తి ఫిట్ నెస్ సాధించినా కూడా గుజరాత్లో తన భార్య ఎమ్మెల్యేగా పోటీచేస్తుండడంతో ప్రచారం చేయడం కోసం బంగ్లాదేశ్ టూర్ కు డుమ్మా కొట్టాడు మన జడ్డూ భాయ్ అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మంచి టీంలేక బంగ్లాదేశ్ పై మన టీమిండియా ఓడిపోగా.. గుజరాత్లో మాత్రం తన భార్యను గెలిపించుకోవడంలో రవీంద్ర జడేజా సక్సెస్ సాధించాడు.

భారత క్రికెట్‌ లో దిగ్గజ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా పేరొందాడు. ఇతడి గైర్హాజరుతో ఆసియా కప్, టీ20 కప్ లో కూడా టీమిండియా తీవ్రంగా ఇబ్బందులు పడింది.  ఈ భారత క్రికెటర్ రవీంద్రజడేజా భార్య రివాబా జడేజా ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ స్థానానికి రివాబా పోటీ చేశారు. ఊహించినట్లుగానే ఆమె తన ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన  కర్సన్ కర్మూర్‌పై 61065 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

బిజెపి రివాబాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. ఆమె మొదటి సారి ఎన్నికల్లో పోటీకి దిగింది. ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు భర్త రవీంద్రజడేజా కూడా బాగా సహకరించారు.  రాజకీయాల్లో అనాదిగా ఉన్న వీరి ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉండంతో భారీ తేడాతో ఊహించని విజయాన్ని రివాబా అందుకుంది. ఆమెపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపితమైంది.

రివాబా జడేజాకు తొలి విజయాన్ని ప్రజలు అందించారు. ఫలితాలు వెలువడిన వెంటనే  రివాబా మీడియాతో మాట్లాడుతూ, "గత 27 సంవత్సరాలుగా గుజరాత్‌లో బిజెపి బాగా పనిచేసి గుజరాత్ మోడల్‌ను స్థాపించింది. ప్రజలు మాపై నమ్మకం ఉంచి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. గుజరాత్ బీజేపీతోనే ఉంది, ఇకముందు కూడా బీజేపీతోనే ఉంటుంది.' అని ఆమె తెలిపింది.

కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ  రివాబా గెలుపొందింది. ఇదివరకూ ఈ సీటులో బిజెపికి చెందిన ప్రస్తుత శాసనసభ్యుడు ధర్మేంద్రసింగ్ జడేజా పోటీచేశారు. అతడిని పక్కన పెట్టి మరీ బీజేపీ టికెట్ ఇవ్వగా రివాబా గెలిచింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News