జేసీ బ్రదర్సుకు కష్టకాలం

Update: 2017-01-17 10:19 GMT
 అనంతపురంలో ముఖ్యంగా తాడిపత్రి టీడీపీలో వర్గవిబేధాలు తీవ్రమవుతున్నాయి. దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న వారు ఇప్పుడు జేసీ బ్రదర్స్‌పై తిరుగుబావుట ఎగరేస్తున్నారు. తాజాగా జేసీ వర్గీయులు, పాత టీడీపీ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు రవీంద్ర పట్టణంలో చేస్తున్న అవినీతిపై కరపత్రాలను ప్రత్యర్థులు విడుదల చేయడంతో కలకలం రేగింది. సీనియర్ టీడీపీ నేత జగదీశ్వర్ రెడ్డి - ఆయన సోదరుడు ఈ కరపత్రాలను విడుదల చేశారు. దమ్ముంటే తాడిపత్రిలో జేసీ - ఆయన అనుచరులు చేస్తున్న అవినీతిపై చర్చకు రావాలని జగదీశ్వర్‌ రెడ్డి వర్గం సవాల్ చేసింది.
    
ఈనేపథ్యంలో రెండు వర్గాలు బహిరంగచర్చకు సిద్ధమయ్యాయి. ఇరు వర్గాలు భారీగా మోహరించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. బహిరంగచర్చకు జరగకుండా అడ్డుకున్నారు. జగదీశ్వర్‌ రెడ్డి 20ఏళ్లుగా టీడీపీలో ఉంటున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఎన్నికల ముందు టీడీపీలో చేరిన జేసీ బ్రదర్స్ మాత్రం జగదీశ్వర్‌ రెడ్డికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి దక్కకుండా అడ్డుకున్నారు. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనూ జగదీశ్వర్‌ రెడ్డిపై దాడి చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారు.
    
దీంతో తనకు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ జగదీశ్వర్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సొంత సామాజికవర్గంపై పదేపదే చులకన వ్యాఖ్యలు చేస్తున్న జేసీ… ఇప్పుడు టీడీపీ నేతలను కూడా దూరం చేసుకుంటుండడంతో వచ్చే ఎన్నికల్లో కష్టమేనంటునట్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News