అవును.. రోజు వ్యవధిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ కావటమే కాదు.. దాదాపు గంటకు పైనే వారిద్దరి మధ్య సమావేశం జరగటం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ చెప్పే అంశాల్ని ప్రధాని మోడీ శ్రద్ధగా విన్నారని చెబుతున్నారు. ప్రధాని స్పందన విషయంలో వివరాలేమీ బయటకు రాకున్నా.. ఒక్క విషయం మీద మాత్రం స్పష్టత వస్తోంది. జగన్ చెప్పిన వివరాల్ని విన్న మోడీ.. అమిత్ షాను కలవాలని.. ఆయనకు చెప్పాలన్నారు.
దీంతో షా తో భేటీ కోసం జగన్ ప్రయత్నించారు. అయితే.. అప్పటికే ఆయన ఖాళీ లేకుండా ఉండటం.. కలిసేందుకు అవకాశం లేకపోవటంతో ఆయన ఏపీకి వచ్చేశారు. ప్రధాని సూచన మేరకు కలవాల్సి వస్తుందన్న సమాచారం షాకు అందటం.. ఆయన శుక్రవారం టైమిచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. రోజు వ్యవధిలోనే ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు.
తాజా జర్నీలో సీఎం జగన్ తో పాటు మరో ఇద్దరు ఎంపీలు కూడా ఢిల్లీకి వెళతారని చెబుతున్నారు. అయితే.. ఏ సమయంలో అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారన్న వివరాలు మాత్రం బయటకు రావాల్సి ఉంది. తాజా టూర్ తో ఏపీకి సంబంధించిన పలు అంశాల మీద క్లారిటీ వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.