ఎన్నికల వేళ తియ్యతియ్యటి మాటలు చెప్పేనేతలకు కొదవ ఉండదు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల్ని మళ్లీ ఎన్నికల ముందు కానీ గుర్తుకు రాని పరిస్థితి. హామీకి.. అమలుకు పొంతన లేని రీతిలో వ్యవహరించే ప్రభుత్వాలకు భిన్నం తమ ప్రభుత్వమని చేతల్లో చేసి చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల వేళ తానిచ్చిన హామీని అమలు చేసేందుకు షెడ్యూల్ కంటే ఏడు నెలల ముందే అమలు చేయనున్న విషయాన్ని తాజాగా వెల్లడించారు.
కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకునేందుకు వీలుగా రైతుభరోసా పథకాన్ని ప్రకటించిన జగన్.. వచ్చే ఏడాది మే నుంచి ఈ పథకాన్ని ఏపీలో షురూ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. గడిచిన ఐదేళ్లలో ఏపీ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించిన జగన్.. తాను ప్రకటించిన సమయం కంటే ముందుగా రైతుభరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ఏపీలోని 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.8750 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ భారీ మొత్తాన్ని వచ్చే మే నాటికి అమలు చేయాలి. కానీ.. ఏడు నెలల ముందే.. అంటే అక్టోబరులోనే రైతుభరోసా పథకాన్ని అమల్లోకి తేనున్నట్లుగా స్పష్టం చేశారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 15.36 లక్షల మంది కౌలు రైతులకు కూడా పెట్టబడి సాయాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఈ పథకం కింద అక్టోబరు 15 నుంచి ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 చొప్పున అందిస్తామన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ భారీ మొత్తాన్నిరైతు బ్యాంకు అకౌంట్లో కాకుండా నేరుగా వారి చేతులకు క్యాష్ ఇవ్వనున్నారు. అలా చేయటం ద్వారా రైతులు తమకున్న అప్పుల్ని తీర్చుకునే వీలుందని చెబుతున్నారు. దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల హామీని చెప్పిన గడువు కంటే 7 నెలల ముందే అమలు చేసింది లేదు. ఆ విషయంలో జగన్ తొలి సీఎంగా మారనున్నారని చెప్పక తప్పదు.