ఇప్పటికే గ్రామీణ యువతరాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫుల్ బిజీ చేసేశారు. కొంతమందికి గ్రామ వలంటీర్ పోస్టులు దక్కాయి. ఇక గ్రామ సెక్రటేరియట్ జాబుల కోసం గట్టి పోటీ నెలకొని ఉంది. ఇవి నిఖార్సైన ప్రభుత్వ ఉద్యోగాలు. దీంతో వాటిని సాధించడం కోసం యువత తమ వంతుగా గట్టి ప్రయత్నం సాగిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ మంచి జీతభత్యాలు అందుకోవడం - ప్రభుత్వ ఉద్యోగం అనే ట్యాగ్.. ఇవన్నీ యూత్ ను అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఏకంగా ముప్పై వేలకు పైగా ఖాళీలు ఉండటంతో యువత ఆశల పల్లకి ఎక్కింది. ఇప్పటికే నోటిఫికేషన్ రావడం - అప్లై చేయడం జరిగిపోయింది. వచ్చే నెలలో పరీక్ష ఉండబోతోంది. అలా ప్రిపరేషన్ లో ఉన్న యువతకు మరో శుభవార్త చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.
రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉంటుందని జగన్ చెప్పారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జగన్ ఈ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉంటుందని జగన్ ప్రకటించడం గమనార్హం!
జగన్ ఊరికే చెప్పే టైపు కాదు, ప్రభుత్వ శాఖల్లో అయితే బోలెడన్ని ఖాళీలున్నాయి. చంద్రబాబు హయాంలో నామమాత్రంగా కూడా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో జగన్ చేసిన ప్రకటన ఆసక్తిదాయకంగా మారింది.
అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ముప్పై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు జగన్. ఇలాంటి తరుణంలో మరో రెండు లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఆయన ప్రకటించారు. దీన్ని బట్టి యువత ఇక ఫుల్ ప్రిపరేషన్లో మునిగిపోవచ్చని ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది.