వదల బొమ్మాళీ.. అనేది ఓ మూవీలో పాపులర్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగును వైకాపా అధినేత జగన్ - ఆయన ఎమ్మెల్యేలు పదేపదే వల్లెవేస్తున్నారు. ఎందుకంటారా? 2014లో వైకాపా తరఫున గెలిచి ఆనక ఏపీ సీఎం చంద్రబాబు పిలుపుతో ఫ్యానొదిలి.. సైకిలెక్కిన జంపింగ్ జపాంగ్ ల విషయంలో ఏదో ఒకటి చేయాలని మంచి కసిమీద ఉన్నారు జగన్. ఈ క్రమంలో దాదాపు 20 మంది జంపింగ్ లను వదల బొమ్మాళి టైపులో ఏదో ఒక విధంగా సాధించాలని, పవర్ లోకి రాకపోయినా తన పవర్ ఏంటో చూపించాలని ఆయన తెగ ఇదై పోతున్నారు. ఈ నేపథ్యంలో జంపింగ్ ఎమ్మెల్యేలపై నిన్న మొన్నటి వరకు తిట్లు శాపనార్థాల వరకే సరిపెట్టిన జగన్.. ఇప్పుడు ఏకంగా న్యాయపోరాటానికి దిగారు.
తమ పార్టీ నుంచి ఎన్నికై.. చంద్రబాబు పంచన చేరిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాము అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యా తీసుకోలేదని... దీనిపై స్పందించి మూకుమ్మడిగా పార్టీని విడిచి పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ తన పార్టీ తరఫున ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డితో హైకోర్టులో పిటిషన్ వేయించారు. వైకాపా నుంచి జంప్ చేసిన వారందరిపైనా అనర్హత వేటు వేసేలా ఆదేశించాలని కూడా ఆయన తన పిటిషన్ లో అభ్యర్థించారు.
మొత్తంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి - చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి - అత్తార్ చాంద్ బాషా - గొట్టిపాటి రవికుమార్ - జలీల్ ఖాన్ - కిడారి సర్వేశ్వరరావు - కలమట వెంకటరమణ - ఎం.మణిగాంధీ - పాలపర్తి డేవిడ్ రాజు - తిరువీధి జయరాములు - భూమా అఖిలప్రియ - భూమా నాగిరెడ్డి - జ్యోతుల నెహ్రూ - రావు వెంకట సుజయకృష్ణ రంగారావు - పాశం సునీల్ కుమార్ - వరుపుల సుబ్బారావులతోపాటు స్పీకర్ - అసెంబ్లీ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. ఈ సందర్భంగా ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు వాదిస్తూ.. పిటిషన్ కు విచారణ అర్హత లేదన్నారు. అయితే, ఎందుకు లేదో చెప్పడానికి కొంత సమయం కావాలని - ఆయా వివరాలను కోర్టుకు వెల్లడిస్తామని అన్నారు. దీంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఇక, ఈ విషయంలో జగన్.. తెలంగాణలోని టీ టీడీపీ నేతల ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.
ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ విసిరిన ఆకర్ష్ వలకు టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగి.. మా బాగుందంటూ కారెక్కేశారు. దీంతో దిమ్మతిరిగిన టీడీపీ నేతలు ముందు స్పీకర్ కి విన్నవించినా ఫలితం కనిపించకపోయేసరికి.. కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు జగన్ ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. మరి కోర్టులో అయినా జగన్ కి ఊరట లభిస్తుందో లేదో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/