ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పటివరకూ ఏ నిర్ణయం మీదా భిన్నాభిప్రాయం వ్యక్తం కాలేదు. స్వపక్షం సంగతి సరే.. విపక్షం సైతం కామ్ గా ఉండిపోయింది. అయితే.. ఒక్క విషయంలో మాత్రం జగన్ వీరాభిమానులు సైతం తీవ్ర నిరాశకు గురైన ఉదంతం ఏదైనా ఉందంటే.. జగన్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు మంత్రి పదవి దక్కకపోవటం.
జగన్ కేబినెట్ లో ఆమెకు మంత్రి పదవి పక్కా అని.. హోంమంత్రిని చేయనున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇదిలా ఉంటే.. అసలు ఆమెకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వకుండా జగన్ తీసుకున్న నిర్ణయం పలువురికి షాకింగ్ గా మారటమే కాదు.. జగన్ అభిమానులు సైతం డిస్పాయింట్ అయ్యారు.
సోషల్ మీడియాలోనూ అలాంటి భావనే వ్యక్తమైంది. అయితే.. సామాజిక సమీకరణాల విషయంలో పట్టుదలతో ఉన్న జగన్.. రెడ్డి వర్గానికి అవసరమైన మేరకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాను తప్పించి.. అదే పనిగా భుజాన వేసుకోనన్న విషయాన్ని స్పష్టం చేసేలా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఇందులో భాగంగానే రోజాకు మంత్రి పదవి దక్కని పరిస్థితి. రెడ్డి కోటాలో సీనియర్ నేతలకు స్థానం కల్పించటంతో ఆమెకు చోటు దక్కలేదు.
రోజాకు పదవి దక్కకపోవటంపై ప్రజల్లో చోటు చేసుకున్న రియాక్షన్.. జగన్ దృష్టికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. మంత్రి పదవి ఇవ్వలేకున్నా ఆమెకు కీలకపదవిని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఆర్టీసీ ఎండీ పదవిని ఆమెకు కేటాయించాలని భావిస్తున్న జగన్.. ఇదే విషయాన్ని ఇప్పటికే విజయసాయి చేత రోజాకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.
మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవటంపై రోజాకు కారణాలు వివరించటంతో పాటు.. ఆర్టీసీ ఎండీ పదవి విషయాన్ని రోజాకు తెలియజేశారు. దీనికి ఆమె ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటం ఖాయమంటున్నారు.