'ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో..'- అంటూ పాడుకోవడం.. అక్కడ కుదరదు! ఎందుకంటే.. అన్నీ బందై.. నిర్బంధమై ఉంటాయి. బడి బంద్,కిరాణా బంద్, రవాణా బంద్.. అన్నీ బంద్. బంద్.. దీనికి కారణం.. 'జగన్ రాక'! సీఎం జగన్ వస్తున్నారంటే.. సర్వం బంద్ కావాల్సిందే.. రోడ్లపై బారికేడ్ ల క్యూ కనిపించాల్సిందే! ఇది తరచుగా కనిపిస్తున్నా.. రాజమండ్రిలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం జరగనున్న సీఎం సభకు సుమారు 1000 మం ది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎటు చూసినా.. కాఖీలే దర్శనమిస్తున్నాయి. గోదావరి జిల్లాలతోపాటు అనకాపల్లి, విశాఖ, విజయనగరం తదితర జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. ఇక నిఘా విభాగాల అధికారులు డేగకన్నేశారు.
ఈ నెల నుంచి సామాజిక పింఛన్‌ను రూ.250 పెంచి, మొత్తం రూ.2,750 చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమా న్ని వారోత్సవాల కింద నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాజమండ్రిలో సభ ఏర్పాటు చేశారు.
ఈ పింఛన్ల పెంపును సీఎం మంగళవారం లాంఛనంగా ప్రారంభించి ఒక ఐదుగురికి ఇవ్వనున్నారు. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ఆయా ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, వైసీపీ నేతల సమక్షంలో పంపిణీ చేస్తారు.
ఈ సభ కోసం సుమారు 70 వేల మందిని తరలించాలన్నది లక్ష్యం. ఇప్పటికే డ్వాక్రా మహిళలు అందరూ రావాలని హుకుం జారీ చేశారు. ఇక, ఇదేసమయంలో రాజమహేంద్రవరంలో సీఎం రోడ్డు షో నిర్వహించ నున్నారు. దీనికోసం రోడ్డంతా పార్టీ జెండాలతో నింపారు.
ఆర్ట్స్ కాలేజీ సభలో కుర్చీలు వేసి, చుట్టూ డేరాలు కట్టారు. సభను చాంబర్లగా విభజించారు. లోపలికి వెళ్లిన జనం సభ ముగిశాకే.. బయటకు వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.