జగన్ పై దాడి కేసు: హైకోర్టుకు నిందితుడు

Update: 2020-09-06 05:00 GMT
సీఎంగా చంద్రబాబు.. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దారుణం ఏపీని షేక్ చేసింది. జగన్ పై కోడికత్తితో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి చేయడం సంచలనమైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. దర్యాప్తు పూర్తి చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు తాజాగా బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. 21 నెలలుగా తాను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత తనపై ఉందని.. బెయిల్ ఇప్పిస్తే కోర్టు షరతులకు లోబడి ఉంటానని పిటీషన్ లో విన్నవించాడు.

ఇక బెయిల్ ఇవ్వని పక్షంలో కనీసం 15 రోజుల్లో కోర్టులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పేలా ఆదేశించాలని కోర్టును కోరాడు. దీనిపై హైకోర్టు ఏం నిర్ణయిస్తుందనేది ఆసక్తిగా మారింది.

కాగా కరోనా కారణంగానే ఎన్ఐఏ విచారణపై అనిశ్చితి నెలకొందని పిటీషన్ లో నిందితుడు శ్రీనివాసరావు తెలిపారు. తాను ఎన్నిరోజులు జైల్లో ఉండాలని కోర్టును అభ్యర్థించాడు.


Tags:    

Similar News