ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మాటలు కాదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో బోలెడంతమంది పని చేస్తుంటారు. వాళ్లకు సంబంధించిన వివరాల్ని.. బాగోగుల్ని పట్టించుకునే ముఖ్యమంత్రులు చాలా తక్కువగా ఉంటారు. అత్యున్నత అధికారులు.. సీనియర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవటం చాలామంది చేస్తుంటారు. అయితే.. తన కార్యాలయంలో పని చేసే చిరుద్యోగిని సైతం గుర్తించటం.. వారికి సంబంధించిన వివరాల్ని తెలుసుకోవటంతో పాటు.. వారి వేడుకులకు హాజరయ్యే సీఎంలు చాలా తక్కువగా ఉంటారు.
అలాంటి పెళ్లి ఒకటి జరిగితే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు. అంతేకాదు.. ఈ పెళ్లికి తాను ఒక్కడిని వెళ్లకుండా.. సతీ సమేతంగా వెళ్లటం ద్వారా తన మనసు ఎలాంటిదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. నిత్యం బిజీబిజీగా ఉండే ముఖ్యమంత్రి జగన్.. తన కార్యాయలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పని చేసే రవి ప్రసాద్ వివాహానికి హాజరయ్యారు.
ముఖ్యమంత్రే స్వయంగా తమ ఇంటి పెళ్లికి రావటం.. సతీ సమేతంగా హాజరు కావటంపై రవి కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.. పలువరు అధికారులతో పాటు.. మంత్రులు కూడా వచ్చారు. జగన్ రాకతో వివాహ వేడుకలో సంబరం అంబరాన్ని అంటిన పరిస్థితి.