ఏపీ సీఎం జగన్ కు సహజంగా తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాదిలో అభిమానులు ఉండడం అనేది కామన్. కానీ ఎక్కడో ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో కూడా అభిమానులున్న విషయం తాజాగా తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిమ్లాలో వ్యక్తిగత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన తన భార్య వైఎస్ భారతితో కలిసి ఈ నెల 26న సిమ్లా వెళ్లారు.
ఆగస్టు 28న ఈ జంట తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని సిమ్లాలోని సుందరమైన ప్రదేశాలలో జరుపుకున్నారు. వారు ఇప్పుడు కలిసి కొంత నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నారు.
సిమ్లాలోని ఒక జంక్షన్‌లో జగన్ -భారతి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగ్ పెట్టారు. ఈ దంపతులకు ప్రత్యేక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ హోర్డింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
జగన్ -భారతి సిమ్లాలోని ఒక స్టార్ హోటల్‌లో ఉంటున్నారు. వారి ప్రయాణం పూర్తిగా వ్యక్తిగత పర్యటన కాబట్టి రహస్యంగా ఉంచబడింది.
ఈ పర్యటనలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మినహా ఏ అధికారి కూడా ముఖ్యమంత్రి వెంట రాలేదు. గత కొన్ని వారాలుగా జగన్ ఈ సెలవుల కోసం ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఈ పర్యటనతో సీఎం జగన్ కాస్త ఈ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. జగన్ -భారతి ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తున్నారు.
Full View
Full View Full View