ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21న పురస్కరించుకుని ఆ పార్టీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. రక్తదానాలు, అన్నదానాలు, వస్త్ర దానాలు, పేదలకు పండ్లు పంపిణీ వంటివాటిని చేపట్టడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబులను అందజేయనుంది.
డిసెంబర్ 21వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు 50 ఏళ్లు నిండనున్నాయి, ఈ 'గోల్డెన్ జూబ్లీ' సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ ప్రభుత్వం పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ట్యాబ్‌లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది.
జూన్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ.. బైజూస్ తో మౌలిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది, ఈ ఒప్పందంలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేయనుంది. అలాగే బైజూస్ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ ను ఆ ట్యాబుల్లో అప్ లోడ్ చేయించనుంది.
ఈ నెల 21న ఈ పథకాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం సగాన్ని దాటిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న దాదాపు 4.7 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు ఈ ట్యాబ్ అందిస్తామని విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
విద్యార్థులకు అందించే ట్యాబ్.. శాంసంగ్ ఏ7. ఇది 8.8 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది. దీని ప్రస్తుత మార్కెట్ ధర రూ.14,000 నుండి రూ.15,000 వరకు ఉంటుందని చెబుతున్నారు.
ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ట్యాబ్‌ల కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తోంది. బైజూస్ వీటికి సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందజేస్తోంది.
ట్యాబ్ పొందిన ప్రతి విద్యార్థికి కోడ్ ఇస్తామని కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. "విద్యార్థి ట్యాబ్‌తో ఏమి చేసినా సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. విద్యార్థులు ట్యాబ్‌ను గరిష్టంగా వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని భావిస్తున్నాం" అని కమిషనర్ సురేష్ అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.