వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల దేశవిదేశాల్లో ఘనంగా జరిగాయి. జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ యూకే - యూరప్ కమిటీలు ఉత్సాహంతో పెద్ద ఎత్తున జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. లండన్ నగరంలోని హౌంస్లౌ పట్టణంలోని 'బుఖారా' ఫంక్షన్ హాల్ లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా స్థానిక ఐసల్ వర్త్ - ఒస్తేర్లీ ఎంపీ రూత్ కాడ్బరి - ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు వైఎస్ ఆర్ సీపీ ఎన్నారై విభాగం ఇంచార్జ్ సునీల్ చలమలసెట్టి - మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా, పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు పాల్గొన్నారు.
యూకే - యూరోప్ తో పాటు ఇతర దేశాల వైఎస్ ఆర్ సీపీ ఎన్నారై కమిటీ సభ్యులు, కార్యకర్తలు,అభిమానులు సుమారు 400 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ఎన్నారై కమిటీ సభ్యులు మరియు విచ్చేసిన అతిధులు దివంగత నేత డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిధులు లండన్ ఎన్నారై కమిటీ సభ్యులను వేదిక మీదకి ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. కమిటి సభ్యులందరూ ముక్త కంఠంతో జై జగన్ - జై వైఎస్ ఆర్ సీపీ - జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేసారు. 2019 లో గెలుపు మనదేనని లండన్ ఎన్నారై కమిటీ ప్రతిజ్ఞ చేసిన అనంతరం తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లడుతూ వైఎస్ ఆర్ సీపీ బడుగు బలహీన వర్గాలకి ఎల్లకాలం అండగా ఉంటుందని, అణగారిన వర్గాల కోసం ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా ముందుంది వారికి సంక్షేమ ఫలాలు వారికి అందేలా చెయ్యడం లో మరియు వారి స్థితిగతులు మెరుగుపడేలా చెయ్యడం లో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు.
కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు మరియు ఎన్ ఆర్ ఐ విభాగం ఇంచార్జి సునీల్ చలమలశెట్టి గారు మాట్లాడుతూ, భవిష్యత్తులో అన్ని ఎన్ఆర్ఐ విభాగాలను ఒకే వేదిక మీడియాకు తీసుకోనివచ్చే ప్రక్రియలో కార్యాచరణ రూపొందిస్తునట్టుగా చెప్పారు. పార్టీని పటిష్టపరచడంలో ఎన్ ఆర్ ఐ విభాగం యొక్క ప్రాముఖ్యత చాలావుందని చెప్పారు.
ఎమ్మెల్యే ఆర్ కే రోజా మాట్లాడుతూ ఎన్నారై కమిటీ వలన పార్టీ కి భవిష్యత్తు లో ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పారు. వైఎస్ ఆర్ సీపీ చేస్తున్న కార్యక్రమాల గురించి మరియు ప్రజల కొరకు ప్రస్తుతమున్న ప్రభుత్వంపై అనుదినం పోరాటం చేస్తున్న 'జగన్' అన్నకి మీవంతు కృషి చెయ్యాలని ఎన్నారై కమిటీని ఉద్దేశించి ప్రసంగించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ 'జగన్ అన్న ప్రజల చేస్తున్న ఈ పోరాటంలో ఎన్నారై ల పాత్ర చాల అవసరం అని కోరారు.
కార్యక్రమం ముగింపు తర్వాత విచ్చేసిన అభిమానులకి మరియు అతిధులకు 'ఎన్నారై కమిటి' భోజన సదుపాయాలని ఏర్పాటు చేసింది. లండన్ ఎన్నారై కమిటీ సభ్యులందరూ విచ్చేసిన అతిధులకి మరియు కార్యక్రమం లో పాలుపంచుకున్న కార్యకర్తలందరికి, జర్మనీ, ఫ్రాన్స్ మరియు ఇతర దేశాల నుంచి వచ్చిన వైఎస్ ఆర్ సీపీ అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ ఆర్ సీపీ యూకే&యూరోప్ విభాగం కన్వీనర్లు సందీప్ రెడ్డి వంగల, శివకుమార్ రెడ్డి చింతం, అబ్బయ చౌదరి కొఠారి, వెంకి మరియు కార్యవర్గ సభ్యులు నవీన్ - సలహా కమిటీ, పి.సి.రావు - ట్రెజరర్, వాసుదేవరెడ్డి - గ్రేటర్ లండన్ ఇంచార్జి, కిరణ్ పప్పు - ఆపరేషన్స్ ఇంచార్జి, కోటిరెడ్డి కళ్ళెం - ఆపరేషన్స్ సపోర్ట్, డా.ప్రదీప్ చింత - కమ్యూనికేషన్స్ ఇంచార్జి, భాస్కర్ మలపాటి - టెక్నాలజీ సెక్రటరీ, రవి మోచర్ల - మార్కెటింగ్సె సెక్రటరీ, సురేష్ ముదిరెడ్డి మరియు ఓబులరెడ్డి - యూత్ సెక్రటరీ, జయంతి రెడ్డి - విమెన్ వింగ్ ఇంచార్జి, రిజ్వాన్ - మైనారిటీ సెల్ ఇంచార్జ్జి మొదలగువారు పాల్గొన్నారు.