మంత్రివర్గ సమావేశంలో జగన్ కీలక నిర్ణయాలు

Update: 2019-11-27 10:48 GMT
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు మర్చిపోవటం.. లేదంటే ప్రస్తుతానికి వాయిదా వేయటం లాంటివి మామూలే. దశాబ్దాలుగా సాగుతున్న ఈ తీరుకు కొత్త అలవాటును పరిచయం చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇచ్చిన హామీలే కాదు.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని వరుసపెట్టి అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది.

తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మరో కీలక పథకానికి పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్న కాపుల్ని ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. ఈ పథకంలో అర్హత సాధించిన మహిళలకు ఏడాదికి రూ.15వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. అందులోని కీలకాంశాల్ని చూస్తే..

%  కాపులను ఆదుకునేందుకు వైఎస్ ఆర్ కాపు నేస్తం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం

%  ఈ పథకం ద్వారా కాపు సామాజికవర్గం మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందిస్తారు.

%  45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఈ పథకం వర్తిస్తుంది. రానున్న ఐదేళ్లలో రూ.75వేల సాయం

%  నవశకం సర్వేతో  వైఎస్ ఆర్ కాపునేస్తం పథకానికి లబ్ధిదారులను ఎంపిక

%  వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కోటాయింపు

%  10 ఎకరాల మాగాణి - 25 ఎకరాల మెట్ట భూమి - 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తింపు

%  కొత్త రేషన్ కార్డులు జారీకి పచ్చజెండా

%  ట్రాక్టర్ - ఆటో - ట్యాక్సీ నడుపుకునేవారికి మినహాయింపు

%  ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు - పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు - డిగ్రీ ఆపైన చదివే విద్యార్థులకు రూ.20వేల ఆర్థికసాయం

%  ఎస్సీ - ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు

%  ఇళ్ల పట్టాలపై హక్కు కల్పిస్తూ పేదలకు రిజిస్ట్రేషన్లు

%  మద్యం ధరల పెంపునకు కేబినెట్ ఆమోదం

%  కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆమోదం

%  స్టీల్ ప్లాంట్ కోసం 3,295 ఎకరాల భూమి సేకరణకు నిర్ణయం

%  ఇనుప ఖనిజం కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం. డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.

%  టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 29కి పెంపు

%  ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు

%  జగనన్న వసతి దీవెన కింద రూ.2300 కోట్లు.. జగనన్న విద్యా దీవెన కింద రూ.3400 కోట్లు కేటాయింపు

%  ఒప్ంపందం ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం

%  ఏపీఎస్పీడీసీఎల్ ను విభజించి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటు
Tags:    

Similar News