జ‌గ‌న్ లండ‌న్ టూర్ క్యాన్సిల్!... రీజ‌నేంటంటే?

Update: 2019-05-04 06:34 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిన్న ఓ మంచి నిర్ణ‌యం తీసుకున్నారు. అప్ప‌టికే షెడ్యూల్ ఖ‌రారు చేసుకున్న త‌న లండ‌న్ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఏకంగా 10 రోజుల‌కు పైగా ఆయ‌న త‌న లండ‌న్ టూర్ ను షెడ్యూల్ చేసుకున్నారు. నేటి ఉద‌యం ఆయ‌న లండ‌న్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. అయితే ఉత్త‌రాంధ్ర‌ను వ‌ణికిస్తున్న ఫ‌ణి తుఫాన్ శ్రీ‌కాకుళం జిల్లాపై విరుచుకుప‌డింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో విరుచుకుప‌డ్డ తుఫాను... భారీ న‌ష్టాన్నే మిగిల్చింది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ఫారిన్ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్న ఆయ‌న‌... త్వ‌ర‌లోనే శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు.

ఫ‌ణి తుఫాను బాధితుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించ‌నున్నారు. జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై హ‌ర్షాతిరేకం వ్య‌క్త‌మ‌వుతోంది. అయినా లండ‌న్ టూర్ కు జ‌గ‌న్ ఎందుకు వెళుతున్నారంటే... అక్క‌డ త‌న పెద్ద కుమార్తె వ‌ర్షారెడ్డి ఉన్న‌త విద్యాభ్యాసం చేస్తున్న సంగ‌తి తెలిసిందే క‌దా. ఎన్నిక‌ల‌కు ముందు సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టిన జ‌గ‌న్‌... యాత్ర ముగిసిన వెంట‌నే కుమార్తెను చూసేందుకు లండ‌న్ వెళ్లాల‌నుకున్నారు. అయితే పాద‌యాత్ర ముగిసిన వెంట‌నే రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అప్పుడు కుద‌ర‌లేదు. అంతేకాకుండా ఎన్నిక‌ల నోటిపికేష‌న్ కు కొద్ది రోజుల ముందుగా కాస్తంత వీలు చేసుకుని ఆయ‌న లండ‌న్ వెళ్లి కూతురుని చూసి వ‌చ్చారు.

అయితే ఎన్నిక‌ల హ‌డావిడి నేప‌థ్యంలో ఆ టూర్ హ‌డావిడిగానే ముగిసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం పోలింగ్ ముగియ‌డం - ఫలితాల‌కు ఇంకా 20 రోజుల స‌మ‌యం ఉండ‌టంతో ఈ సారైనా కాస్తంత ప్ర‌శాంతంగా కూతురితో గ‌డిపి వ‌ద్దామ‌ని ఆయ‌న భావించారు. ఈ క్ర‌మంలోనే 10 రోజుల షెడ్యూల్ ను ఖరారు చేసుకున్నారు. స‌రిగ్గా లండన్ ఫ్లైటెక్క‌డానికి ఓ రెండు రోజుల ముందు ఫ‌ణి తుఫాన్ విరుచుకుప‌డింది. ఈ నేప‌థ్యంలో తుఫాను బాధితుల ప‌రామ‌ర్శ‌కే ప్రాధాన్యం ఇచ్చిన జ‌గ‌న్‌... త‌న లండ‌న్ టూర్ ను ర‌ద్దు చేసుకున్నారు. తుఫాను బాధితుల‌కు అన్ని ర‌కాలుగా అండ‌గా ఉండాల‌ని ఇప్ప‌టికే పార్టీ శ్రేణుల‌కు ఆదేశాలు జారీ చేసిన జ‌గ‌న్‌... స్వ‌యంగా త‌ను కూడా బాధితుల ప‌రామ‌ర్శ‌కు వెళుతున్నారు.

Tags:    

Similar News