తమ ముఖ్యమంత్రికి ఉన్నంత విజన్ మరే సీఎంకు ఉందని తెలుగు తమ్ముళ్లు తెగ గొప్పలు చెప్పుకుంటారు. ఆ మాటకు వస్తే తమ్ముళ్లే కాదు.. వారందరికి హోల్ సేల్ అన్న అయిన చంద్రబాబు సైతం.. తనకు తాను గొప్ప విజనరీగా చెబుతారు. తనకు ముందుచూపు ఎక్కువని.. విశాల దృష్టితో ఆలోచిస్తానంటూ ఆయన తనను తాను తెగ పొగిడేసుకోవటం కనిపిస్తుంటుంది. మరింత ముందుచూపు ఉన్న పెద్ద మనిషి.. విపక్ష నేత విషయంలో ఎందుకంత ఇరుగ్గా ఆలోచిస్తారో ఎంత థింక్ చేసినా అర్థం కాదనే చెప్పాలి.
వందల కోట్ల రూపాయిలు ఖర్చు చేసేసి.. ‘తాత్కాలిక’ హడావుడికి తెర తీసిన చంద్రబాబు.. కొత్త భవనాల్నిఎడాపెడా కట్టించేస్తున్నారు. రాజధాని నిర్మాణం నిర్మాణాత్మకంగా సాగాల్సింది పోయి.. ఇప్పటికి తాత్కాలిక సచివాలయం.. తాత్కాలిక అసెంబ్లీ భవనం అంటూ కట్టిస్తున్న ఆయన.. భవిష్యత్తులో శాశ్విత భవనాల్ని నిర్మిస్తున్నామని చెబుతారు. బాబు తీరు చూస్తే.. బిల్డింగులు కట్టించుకుంటూ ఉండటంతోనే ఆంధ్రోళ్ల బతుకులు తెల్లారేలా కనిపిస్తాయి.
ఇక..కట్టించే బిల్డింగుల్లో వసతుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు తావిచ్చేలా ఉంటుంది. తాజాగా కట్టించిన ఏపీ అసెంబ్లీ భవనం విషయానికి వస్తే.. అత్యాదునిక వసతులతో నిర్మించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికి వచ్చిన ఫోటోలు..వీడియో ఫుటేజ్ చేసినప్పుడు.. పెట్టిన ఖర్చు కళ్లకు కట్టేలా కనిపిస్తోంది. అంతా బాగానే ఉన్నా.. విపక్ష నేతకు కేటాయించిన ఛాంబర్ ఏర్పాటు చూసినప్పుడు బాబు విజన్ మీద సందేహాలు కలిగేలా ఉందని చెప్పాలి.
అన్ని విషయాల్లోనూ ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్లు చెప్పే చంద్రబాబు.. అసెంబ్లీ భవనంలో విపక్ష నేతకు కేటాయించిన ఛాంబర్ ను టాయిలెట్ దగ్గర ఏర్పాటు చేయటం చూస్తే.. బాబుది మరీ ఇంత ఇరుకు మనస్తత్వమా అనిపించక మానదు. ముఖ్యమంత్రికి ఎంతటి గౌరవ మర్యాదలు కల్పిస్తారో..విపక్షనేతకూ అంతే మర్యాదలు ఇవ్వాల్సిన వేళ.. అందుకు భిన్నంగా టాయిలెట్ దగ్గర ఛాంబర్ ఏర్పాటు చేయటం ఏమిటన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ఇదే విషయాన్ని జగన్ పార్టీ నేతలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించి.. తాత్కాలికంగా టాయిలెట్ ను క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. కొత్త భవనాలకు సంబంధించిన ప్లాన్ ను క్షుణ్ణంగా పరిశీలించి.. ఓకే చేసినట్లుగా చంద్రబాబు.. విపక్ష నేత గౌరవానికి భంగం కలిగేలా అసెంబ్లీలో ఆయన చాంబర్ ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. విపక్ష నేతను గౌరవించే విషయంలో బాబు విజన్ ఏమైందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/