పోల‌వ‌రంలో బాబు గుట్టు విప్పిన జ‌గ‌న్‌

Update: 2017-12-07 06:30 GMT
ఏపీకి సంబంధించినంత వ‌ర‌కూ రెండు కీల‌కాంశాలు ఇప్పుడుసీమాంధ్ర ప్ర‌జ‌ల్ని తొలిచేస్తున్నాయి. అందులో ఒక‌టి అమ‌రావ‌తి అయితే..రెండోది పోల‌వ‌రం. ఈ రెండింటి మీద ఏపీ ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌లు అన్నిఇన్ని కావు. అయితే.. అంచ‌నా వ్య‌యాన్ని భారీగా పెంచేయ‌టం ద్వారా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రాజెక్టును దెబ్బ తీస్తున్నారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్రాజెక్టు వ్య‌యం పెంపుతో పాటు.. త‌న‌కిష్టం వ‌చ్చిన వారికి ప్రాజెక్టులు ఇవ్వ‌టంపై కేంద్రం గుర్రుగా ఉండ‌టం ఈ మ‌ధ్య‌న చోటు చేసుకున్న ప‌రిణామంగా చెప్పాలి.

పోల‌వ‌రంపై కేంద్రం అసంతృప్తికి కార‌ణంపై జ‌గ‌న్ రియాక్ట్ అయ్యారు. పోల‌వ‌రం ఇష్యూకు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాల్ని చెప్పారు. కాపుల్ని బీసీల్లోకి చేరుస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న హ‌డావుడి నిర్ణ‌యంపైనా జ‌గ‌న్ స్పందించారు. ఏపీ రాజ‌ధాని అమ‌రాతి నిర్మాణంపై త‌న‌కున్న అభిప్రాయాన్ని జ‌గ‌న్ కుండ బ‌ద్ధ‌లు కొట్టారు. ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో.. ఆయా అంశాల‌పై జ‌గ‌న్ ఎలా స్పందించారు? ఏమ‌ని చెప్పారు? అన్న‌ది చూస్తే..

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై..

"చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడని చెబుతాను. నాలుగు పంటలు పండించే భూమిని ప్రజల ఇష్టాలతో సంబంధం లేకుండా తీసుకోవడం. రెండోది రాజధాని భూములను ఒక స్కాముగా వాడుకోవడం. రాజధాని ఎక్కడ వస్తుందని తెలిసి కూడా ఈయన రైతులను మిస్‌ లీడ్‌ చేశాడు. అటు తన బినామీలతో తక్కువ రేటుకు భూములు కొనిపించినాడు. కొనిపించాక ఇక్కడే రాజధాని అని డిక్లేర్‌ చేయించాడు. పాపం భూములు అమ్ముకున్న రైతులు నష్టపోయారు"

"బినామీల భూములను వదిలేసి పేదవాడి భూములను అన్యాయంగా లాక్కొన్నారు. ఇంతవరకు పర్మినెంటు అనే పేరుతో ఒక్క ఇటుక పడలేదు. తీసుకున్న భూములన్నీ ఈయన ఇష్టమొచ్చినట్లుగా నచ్చిన వాళ్లకు నచ్చిన రేటులో నామినేషన్‌ పద్ధతిలో భూములు పంపిణీ చేస్తున్నారు. ఈయన ముడుపులు తీసుకొంటున్నారు. ఇది ఏమన్నా రాజధానా? రాజధాని స్కామా?"

పోల‌వ‌రంపై..

"చంద్రబాబు తాను చేయాల్సిన పనిని చేయలేక ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టును ఎందుకు చేపట్టలేకపోతున్నాడో కారణాలు అందరికీ తెలిసినవే. అంచనా వ్యయాన్ని రూ.16 వేల నుంచి రూ.56 వేల కోట్లకు పెంచేసి, నామినేషన్‌ పద్ధతిలో ఇష్టం వచ్చిన వారికి అప్పగిస్తే కేంద్రం ఊరుకుంటుందా?  రూల్స్ ప్ర‌కారం టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించిన కేంద్రంపై బండలు వేయాలని చంద్రబాబు చూస్తున్నారు"

కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై..

"కాపుల రిజర్వేషన్లు, బోయలను ఎస్టీలుగా మార్చడంలోనూ అదే జరిగింది. ఈ అంశాలను కేంద్రం కోర్టులోనే వేస్తున్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేసేస్తానని చెప్పి, నాలుగేళ్లయినా చేయలేక, ఇప్పుడు ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మంజునాథ అనే ఆయన బీసీ కమిషన్‌ ఛైర్మన్‌. ఆ కమిషన్‌ ఛైర్మనే నేను నివేదిక ఇవ్వలేదంటుంటే... నివేదిక ఇచ్చారని, దాని ఆధారంగా తీర్మానం పెట్టామని అంటున్నారు. వాస్తవానికి దాన్ని ఎవ్వరూ చూడలేదు. అయినా సరే దానిపై తీర్మానం చేసి పంపామంటున్నారు. ఇలా చేసిన తీర్మానాన్ని ఏ కోర్టయినా ప్రశ్నిస్తుంది"

కేంద్రంతో విడిపోయే ధైర్యం బాబు ఉందా?

ష‌విడిపోయేంత ధైర్యం చేయడానికి చంద్రబాబు ఇప్పుడు భయపడతారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో - వీడియో టేపులతో సహా దొరికిపోయాడు. ఇంకా ఎన్నో అవినీతి కేసులున్నాయి. కాబట్టి కేంద్రంతో అంత త్వరగా విభేదించడు. చివరి నాలుగు నెలల్లో - ఆరు నెలల్లో చేయొచ్చు. కచ్చితంగా చేసిన తప్పులన్నీ నావి కాదు - కేంద్రం నన్ను పనిచేయనివ్వలేదని సహజంగానే నెపం వాళ్లమీద వేసేస్తాడు"
Tags:    

Similar News