ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశాలకు కొదవ లేదని చెప్పాలి. మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు.. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. ఈ సందర్భంగా మంత్రి యనమల ఉడికిపోయేలా జగన్ చురకలు తగిలించారు. అసలేం జరిగిందంటే..
సభ మధ్యలో జగన్ బయటకు వెళ్లి కాసేపటికి వచ్చారు. ప్రతిపక్ష నేత సభలో లేకపోవటాన్ని మంత్రి యనమల ప్రశ్నించారు. దీనికి జగన్ రియాక్ట్ అవుతూ.. బాత్రూంకు కూడా వెళ్లొద్దా అని అడిగారు. ‘బాత్రూంకు వెళ్లేటప్పుడు వేలు చూపించి వెళ్లాలని నాకు తెలీదు’’ అంటూ చరకేశారు. దీనికి ఉడికిపోయిన యనమల.. బాత్రూంకు వెళ్లేటప్పుడు నలుగురైదుగురు ఎందుకని అడిగిన ఆయన.. కావాలనే వెళ్లారంటే ఫస్ట్రేట్ అయిపోయారు.
మీరు ఇలా చూపిస్తారా? అలా చూపిస్తారా? అన్నది మీ ఇష్టమన్న యనమల హైదరాబాద్ లో కూడా ఇలాగే చేశారన్నారు. విపక్ష నేత సభలో లేరన్న విషయాన్ని అదేదో పెద్ద తప్పుగా ప్రస్తావించిన యనమల మాటలకు బదులిచ్చిన జగన్.. తనకు ఇప్పుడే తెలిసిందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనమడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లినట్లుగా వ్యాఖ్యానించారు.దీనికి బదులిచ్చిన యనమల.. సీఎం చంద్రబాబు ముందే అనుమతి తీసుకున్నట్లుగా చెప్పారు. సభకు అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్న వ్యక్తిని తానేనని జగన్ వ్యాఖ్యానించారు. అయినా.. విపక్ష నేత ఏమైనా స్కూల్ పిల్లాడా?మధ్యలో సభ బయటకు ఎందుకు వెళ్లారు? ఎక్కడకు వెళ్లారు? అని అడుగుడేందో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/