ఏపీ ప్రతిపక్ష నాయకుడు - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ పరిణితికి పదును పెడుతున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని పట్టుపడుతున్న జగన్ ఇదే అంశంపై రాష్ట్ర నలుమూలలా యువభేరి పేరుతో సభలు నిర్వహించేందుకు సన్నద్ధం అయిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై ‘యువభేరి’ సదస్సులతో యువతను లక్ష్యంగా చేసుకున్న జగన్ ఇపుడు ప్రత్యేక హోదా సాధన కోసం ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. అయితే జగన్ డిమాండ్ ను కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోకపోగా...హోదాకు దీటుగా ప్యాకేజీ ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొంది. ఇచ్చినంత తీసుకోపోతే నష్టపోతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిందాంతో సరిపెట్టుకున్నారు. జగన్ డిమాండ్ డిమాండ్ గానే మిగిలిపోయింది. అదే డిమాండ్‌తో ఉద్యమాన్ని మరో కొత్త పేరుతో జగన్ ప్రారంభించనున్నారు. రెండో దశ ఉద్యమానికి జై ఆంధ్రప్రదేశ్ అని నామకరణం చేశారు. విశాఖలో తొలి సభను నిర్వహించనున్నారు. అయితే ఈ సభ వెనుక మూడు లక్ష్యాలున్నాయని తెలుస్తోంది.
ఏకకాలంలో ఇటు ప్రత్యేక హోదా గళం - మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టడంతో పాటుగా గ్రేటర్ విశాఖ నగరపాలక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ - టీడీపీ ప్రభుత్వాలు దగా చేసిన తీరు - రెండున్నరేళ్లలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు జై ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహిస్తున్నట్లు నేతలు చెప్తున్నప్పటికీ కీలకమైన ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో పట్టు సాధించే లక్ష్యాన్ని కూడా జగన్ తన ముందు ఉన్న లక్ష్యంగా భావించి విశాఖను ఎంచుకున్నట్లుగా సమాచారం. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే జై ఆంధ్రప్రదేశ్ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణానికి స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం - సభా వేదికకు గురజాడ అప్పారావు పేరిట నామకరణం చేశారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/