ఆ మూడు ఎన్నికలపై జ‌గ‌న్ న‌జ‌ర్‌

Update: 2016-12-26 07:57 GMT
ఏపీ ప్ర‌తిపక్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి రాబోయే ఎన్నిక‌ల కోసం శ‌ర‌వేగంగా ముందుకు సాగుతున్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకునేందుకు పార్టీ శ్రేణుల‌ను ఇప్ప‌టి నుంచే జ‌గ‌న్ సిద్ధం చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులలో శనివారం నాయకులు - కార్యకర్తలతో జగన్ మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారపార్టీ ఎత్తుగడలు - వ్యూహాలను తిప్పికొట్టాలని నాయకులు - కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

క‌డ‌ప జిల్లాలోని నగరపాలక సంస్థ  - పురపాలక సంఘాల్లో కౌన్సిలర్లు వైకాపా వారే అధికంగా ఉన్నారని - జడ్పీటీసీలు - ఎంపీటీసీల్లో మెజారిటీ మనదేనని జ‌గ‌న్ పార్టీ నాయ‌కుల్లో భ‌రోసా నింపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వైఎస్ వివేకానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. పశ్చిమ రాయలసీమ జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గోపాల్‌ రెడ్డి - టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీచేస్తున్న కత్తి నరసింహారెడ్డిని సైతం గెలిపించుకోవాలని జ‌గ‌న్ అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని జ‌గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా నిరుద్యోగులు ఎవరికీ జాబు రాలేదన్నారు. టీడీపీ ప్రభ్వుంపై వ్యతిరేకత వస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పులివెందుకుల నీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News