తడిచిపోతున్నా జగన్ నడక ఆగలేదు!
రాజకీయాల్లో మొండితనం చాలా అవసరం. అనుకున్నది సాధించే వరకూ.. గురి పెట్టిన లక్ష్యాన్ని చేరుకునే వరకూ పట్టుదలను వీడకూడదు. ఆ విషయంలో ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరూ వేలెత్తి చూపలేరు. ఏదైనా విషయంలో ఒకసారి డిసైడ్ అయితే చాలు.. దాన్ని సాధించే క్రమంలో ఎలాంటి కష్టం ఎదురైనా సరే.. దాని నుంచి వెనక్కి వెళ్లేందుకు అస్సలు ఇష్టపడని తీరు జగన్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది.
తాజాగా ఆయన చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రనే చూస్తే.. ఆయనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆయన వెనక్కి అడుగు వేయని తత్త్వం కనిపిస్తుంది. తాజాగా ఆయన విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర సందర్భంగా జోరు వర్షం తడిచి ముంచెత్తుతోంది. అయితే.. అంతటి జోరు వర్షంలోనూ తన పాదయాత్రను ఆపకుండా.. ఉత్సాహంగా ఆయన అడుగులు వేస్తున్న తీరుకు.. ఆయన్ను అనుసరిస్తున్న వేలాది అనుచర గణంలో ఉత్సాహం ఉరకలెత్తింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జోరున కురుస్తున్న వర్షంలో తడిచి పోతున్నా.. ఆ అసౌకర్యాన్ని ఏ మాత్రం ఫీల్ కాకపోవటం ఒక ఎత్తు అయితే.. ఆ వర్షాన్ని సవాల్ చేసేలా జగన్ ఉత్సాహం ఉందని చెప్పాలి. జోరు వర్షంలోనూ ఆగని జగన్ నడకను చూసినప్పుడు ప్రకృతిలో ఆయనో భాగమైనట్లుగా వ్యవహరించారని చెప్పక తప్పదు. వర్షంలో తడుస్తూ.. ఉత్సాహంగా అడుగులు వేసిన జగన్ ఫోటో ఆయన అభిమానుల్ని విపరీతంగా అలరిస్తోంది.