చేసింది గొప్పగా చెప్పుకోవటం తప్పేం కాదు. కానీ.. తాను చేసింది గొప్ప పనా? కాదా? అవగాహన లేకుండా.. తోచినట్లుగా చేసుకుపోయే తత్త్వం.. అందులోని లోపాల్ని గుర్తించలేని వైఖరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్కువే. తొమ్మిదిన్నరేళ్లు నాన్ స్టాప్ గా సీఎంగా పని చేసినట్లు గొప్పలు చెప్పుకునే ఆయన.. హైదరాబాద్ అభివృద్ధి మొత్తం తన చలువేనని చెప్పుకునే చంద్రబాబు.. నోరు తెరిచి ఏదైనా అంశం మీద నాన్ స్టాప్ గా చెప్పమంటే ఆయన పస ఏమిటో అర్థమైపోతుంది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు.. కేంద్రంలో రాష్ట్రపతిని.. ప్రధానిని నియమించే విషయంలో కీ రోల్ ప్లే చేసినట్లుగా డాబుసరి మాటల్ని చెప్పే ఆయన మాటల్లో డొల్లతనం ఇట్టే కనిపిస్తుంది. నిజానికి బాబులో సబ్జెక్ట్ కాని కాస్తంతైనా ఉండి ఏడిస్తే.. ఈ రోజు ఏపీకి ఇన్ని తిప్పలు పట్టేవి కావు.
విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా ఏడు మండలాల్ని తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన వైనంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. తమ రాష్ట్రానికి ఏడెనిమిది గ్రామాలైనా తిరిగి ఇవ్వాల్సి ఉందని.. ఆ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రితో తాను మాట్లాడానని.. ప్రధాని దగ్గరకు వెళ్లి మాట్లాడదామని చెప్పారని.. ఆ విషయం మీద తాను దృష్టి పెడతానని కేసీఆర్ అదే పనిగా చెప్పినా.. దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వరు. ఇదొక్కటే కాదు.. బాబుతో వచ్చే ప్రాబ్లం ఏమిటంటే.. ఆయన ఏ విషయంలోనూ తన వాదనను సమర్థంగా వినిపించే ప్రయత్నం చేయరు.
కానీ.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ అందుకు భిన్నంగా.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయనకున్న సాధికారిత అంతా ఇంతా కాదు. ప్రాజెక్టుల రూపురేఖలు.. వాటి వల్ల కలిగే లాభనష్టాలతో సహా.. డిజైన్ల తదితర అంశాలపైనా ఆయనకు పట్టు చాలా ఎక్కువ. పట్టి సీమ ప్రాజెక్టు కారణంగా ప్రజాధనం వృధా అవుతుందన్న వాదనను వినిపించినా.. తక్కువ వ్యవధిలో ఒక ప్రాజెక్టును పూర్తి చేసి.. క్రెడిట్ కొట్టేయాలన్న ఆలోచన తప్పించి.. దాని వల్ల జరిగే లాభ నష్టాల మీద సవివరమైన వాదనను వినిపించింది లేదు.
ఇలాంటి వేళ.. బాబు చేసే పనులు.. తీసుకున్న నిర్ణయాలు ఎంత పేలవంగా.. ప్రజా ధనాన్ని వృధా చేసేలా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్. ఏపీ అసెంబ్లీలో ఈ రోజు (మంగళవారం) సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం.. వ్యయంపై ప్రశ్నోత్తరాల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. ఈ సందర్భంగా విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తప్పుల్ని కళ్లకు కట్టినట్లుగా చూపించటమే కాదు.. ఆయన తప్పుల్ని బట్టలిప్పి చూపించిన వైనంపై పలువురి దృష్టిని ఆకర్షించింది. జగన్ ప్రసంగాన్ని విన్న వారంతా.. బాబు నిర్ణయాలు ఇంత దారుణంగా ఉంటాయా? అన్న భావన కలగటం ఖాయం. అసెంబ్లీలో జగన్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
కరెంటు చార్జీల కోసం రూ.136 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి పట్టిసీమ నుంచి 110 రోజుల్లో 42 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తే అక్కడి నుంచి 55 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్వాకం ఇది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం గత మూడేళ్లలో 15213.83 కోట్ల రూపాయిలు బడ్జెట్ కేటాయింపులు చేశామని.. రూ.21632.73 కోట్లు వ్యయం చేశామని మంత్రి చెబుతున్నారు. అయితే.. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందే తప్పించి.. మరొకటి లేదు.
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో 2016–17లో 40 శాతం నీటి ప్రవాహం (ఇన్ ఫ్లో) తగ్గింది. అదే మాదిరిగా తుంగభద్రలో 60 శాతం, పెన్నాలో 60 శాతం తగ్గింది. నాగార్జున సాగర్ - తుంగభద్ర హైలెవెల్ కెనాల్ సహా చాలా చోట్ల ఇన్‌ఫ్లో తగ్గింది. మరోవైపున.. పట్టిసీమ నుంచి రూ.136 కోట్ల రూపాయలు కరెంట్ చార్జీలకు ఖర్చు పెట్టి 110 రోజుల్లో 42 టీఎంసీలను ప్రకాశం బ్యారేజీకి తరలించి అక్కడి నుంచి 55 టీఎంసీలను సముద్రం పాలు చేశారు. అయినా అంత గొప్పగా ఉందని చెబుతున్నారు మంత్రిగారు.
అదే వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కట్టి ఉంటే.. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేది. అలా చేసి ఉంటే కృష్ణా డెల్టాలోనూ, మిగిలిన చోట్లా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఆ పని చేయలేదు. అదేకాదు.. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల పైచిలుకు నీళ్లు 180 రోజులు నిల్వ ఉన్నా రాయలసీమకు నీళ్లు ఇవ్వలేని అధ్వాన్న స్థితి. రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లే ఫ్లడ్ ఫ్లో కెనాల్ తయారు కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
ఒకవేళ అదే తయారై ఉంటే గండికోటలో 26 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే పరిస్థితి ఉండేది. గండికోటతో పాటు చిత్రావతి, సర్వారాయ సాగర్ తదితర ప్రాజెక్టులకూ నీళ్లు వచ్చేవి. ఇవేవీ చేయకపోగా గండికోటకు 5,6 టీఎంసీల నీళ్లు ఇచ్చినట్టు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి 2012లోనే కలెక్టర్ శశిధర్ వేరే రూట్‌లో గండికోటకు 4 టీఎంసీల నీళ్లు తీసుకు వచ్చారు. ఫోటోలు కూడా దిగారు. ఆ విషయాన్ని నేటి ప్రభుత్వం విస్మరిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/