టీడీపీ ఆరోప‌ణ‌ల‌కు జ‌గ‌న్ కౌంట‌ర్ ? రియాక్ష‌న్ అదిరింది

Update: 2022-03-17 06:10 GMT
రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్యే ఏళ్ల‌కు ఏళ్లు ఆంధ్రావ‌నిలో యుద్ధాలు జ‌రుగుతున్నాయి. ర‌ణ క్షేత్రంలో అటు టీడీపీ ఇటు వైసీపీ. ఈ రెండు పార్టీలే ఓటు బ్యాంకు రాజ‌కీయంలో స‌మ‌ర్థ‌త‌కు ప్రామాణికంగా రాణిస్తున్నాయి.మిగిలిన పార్టీలు ఇటుగా వ‌చ్చినా కూడా ఆశించిన ఫ‌లితాలు అందుకోలేక చతికిల‌ప‌డుతున్నాయి.

ఈ కోవ‌లోనే గ‌తంలో పీఆర్పీ ఇప్పుడు జ‌న‌సేన. ఈ క్ర‌మంలోనే ఇంకొన్ని పార్టీల పేర్లు కూడా రాసుకోవ‌చ్చు. జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ్ నేతృత్వాన లోక్ స‌త్తా కొంత కాలం, ప్ర‌ముఖ శాంతి సందేశకులు కేఏ పాల్ ప్ర‌జా శాంతి పార్టీ ఇంకొంత కాలం ఇలా చాలా పార్టీలు వ‌చ్చి వెళ్లాయి కానీ హ‌వాను చాటుకోలేక‌పోయాయి.

ఆఖ‌రికి మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ రెండు పార్టీలే అర‌వై, నల‌భై నిష్ప‌త్తుల్లో వాటాలు పంచుకుని అధికారంలోకి వ‌స్తాయి అని గ‌తంలో కొన్నివిమ‌ర్శ‌లు సాక్షాత్తూ జ‌న‌సేన గూటి నుంచే వినిపించాయి.ఈ క్ర‌మంలో వైసీపీ ఇప్పుడొక కొత్త స్ట్రాట‌జీ ఎత్తుకుంది.అదేంటంటే..

స‌ర్వ‌సాధార‌ణంగా రాజ‌కీయాల్లో విప‌క్ష స‌భ్యుల ఆరోప‌ణ‌ల‌కు పెద్ద‌గా విలువ అన్న‌ది ఉండ‌దు.కానీ వైసీపీ తెలివిగా టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను మైకు ముందు కొట్టి పారేస్తుంది కానీ తెర వెనుక నిజానిజాలు తెలుసుకుని సంబంధిత వ్య‌క్తుల‌పై వెంట‌వెంట‌నే చ‌ర్య‌లు చేప‌డుతోంది.

ఈ కోవ‌లో తణుకు ఎమ్మెల్యే నాగేశ్వ‌ర‌రావు అక్ర‌మాల‌ పై వైసీపీ అధినాయ‌క‌త్వం దృష్టి పెట్టింది. మున్సిపాల్టీలో ఆయ‌న చేసిన అక్ర‌మాలు, కొల్ల‌గొట్టిన కోట్ల రూపాయ‌ల వివరాలు ఆధారాల‌తో స‌హా విప‌క్ష టీడీపీ నుంచే సేక‌రించి ఇప్పుడాయ‌న‌పై వేటు వేసేందుకు సిద్ధం అవుతోంది.

ఇప్ప‌టికే అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నా అవి స‌రిపోవ‌ని జ‌గ‌న్ వ‌ర్గం భావిస్తోంది.దీంతో త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి ఎదుట బోనులో త‌ణుకు ఎమ్మెల్యే నిల‌బ‌డి త‌న సంజాయిషీ ఇచ్చుకోనున్నారు అని తెలుస్తోంది.
Tags:    

Similar News