స్టేడియంలోకి జ‌గ‌న్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే..?

Update: 2019-05-29 05:29 GMT
విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన రెండో ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌నంత భారీగా సీట్ల‌ను (151 అసెంబ్లీ స్థానాలు) సొంతం చేసుకొని అధికారాన్ని సొంతం చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. రేపు (గురువారం) విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వాన్ని రోటీన్ కు కాస్త భిన్నంగా నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ వ‌ర్గీయులు భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. స్టేడియం చుట్టూ గ్యాల‌రీల్లో ప్ర‌జ‌లు కూర్చోనున్న నేప‌థ్యంలో.. తొలుత ఓపెన్ టాప్ వాహ‌నంలో స్టేడియంలోకి జ‌గ‌న్ రానున్న‌ట్లుగా చెబుతున్నారు. స్టేడియంలో వాహ‌నంలో నిల‌బ‌డి.. స్టేడియం చుట్టూ ఒక రౌండ్ వేసి.. గ్యాల‌రీలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికి అభివాదం చేస్తార‌ని చెబుతున్నారు.

స్టేడియంలోకి జ‌గ‌న్ ఎంట్రీ.. ఆ త‌ర్వాత గ్యాల‌రీలో ప్ర‌జ‌ల‌కు అభివాదం త‌ర్వాత త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వాన్ని నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌ల‌కు అభివాదం తెలిపిన త‌ర్వాత ప్ర‌ధాన వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. ప్ర‌త్యేక ఆహ్వానితులు.. వీఐపీలు.. అధికారులు కూర్చునే గ్యాల‌రీలోకి జ‌గ‌న్ ఎంట‌ర్ అవుతారు. ప్ర‌త్యేక వార్డ్  రోబ్ మీద న‌డుచుకుంటూ వెళ్లి అభివాదం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం రోటీన్ కు భిన్నంగా ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News