ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా పులివెందుల అసెంబ్లీ బరిలో నిలిచిన ఆయన తన నామినేషన్ ను దాఖలు చేశారు. ముందుగా అనుకున్నట్లే సరిగ్గా ముహుర్తం వేళకు ఆయన తన నామినేషన్ ను సమర్పించారు. కడపజిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న జగన్.. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 1.49 గంటల వేళలో తన నామినేషన్ ను ఎన్నికల అధికారికి అందజేశారు.
పులివెందులలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న జగన్.. తొలుత నామినేషన్ పత్రాల్ని అధికారులకు అందించారు. నామినేషన్ దాఖలు చేయటానికి కాసేపు ముందు సర్వమత ప్రార్థనల్ని నిర్వహించారు. దానికి ముందు స్థానిక సీఎస్ ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. ఏపీ ప్రజల్ని ఆయన ఏ రీతిలో మోసం చేస్తున్నారో వివరించారు. ఆయన చేసే కుట్రలు.. కుతంత్రాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఈ రోజు జగన్ తో పాటు.. ఏపీ వ్యాప్తంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయటం గమనార్హం.