ఆ పన్ను దరిద్రాన్ని నాన్న తీయలేదేం జగన్?

Update: 2016-03-18 04:25 GMT
అప్పుడప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపరీతంగా ఆవేదన చెందుతుంటారు. ప్రజలకు ఇంత కష్టమా అని కదిలిపోతుంటారు. ఈ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వల్లనే కదా.. ప్రజలకు ఇన్ని కష్టాలన్నట్లుగా జగన్ మాటలు ఉంటాయి. తాజాగా ఆయన పెరిగిన పెట్రోల్.. డీజిల్ ఛార్జీల మీద గురి పెట్టారు. గడిచిన ఐదారేళ్లలో పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు మీద జనాలు రియాక్ట్ కావటం దాదాపుగా మానేశారు.

ప్రతి పదిహేను రోజులకోసారి సమీక్ష.. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం పెంచటమో.. లేదంటే తగ్గించటమో పక్కాగా జరిగిపోయే ప్రక్రియ. మరీ.. ప్రతి రెండు వారాలకు ప్రజల్నికదిలిస్తూ..ఆందోళనలు.. నిరసనలు అంటే కష్టం కదా. అందుకే.. ఈ అంశంపై రాజకీయ పార్టీలు కూడా మాట్లాడటం దాదాపు తగ్గించేశాయి. అలాంటి ఇష్యూను జగన్ బాబు టచ్ చేసి.. జనాలకు ఇంత అన్యాయం చేస్తారా? అంటూ నిలదీశారు.

ధరల పెంపుతో పాటు.. దీనికి సంబంధించిన మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. పెట్రోల్ మీద 31 శాతం పన్నుపోటు.. మరో నాలుగు రూపాయిలు వ్యాట్ విధిస్తూ ప్రజల మీద పెను భారాన్ని మోపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ కు ఇలా ఉంటే.. డీజిల్ విషయంలో 22.5 శాతంతో పాటు మరో రూ.4 వ్యాట్ కింద వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. తాను చెప్పిన పన్నులెక్క అంతా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకే వెళుతుందని వాపోయారు. జగన్ వేదనలో నిజం లేకపోలేదు. కాకుంటే.. తాను పరిపాలించిన ఆరేళ్ల పాటు.. ఆ దివంగత ముఖ్యమంత్రి.. ఆ దివంగత మహా నేత.. ప్రియతమ నాయకుడు అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం పన్ను పోటును సున్నా చేయటమో లేదంటే.. నామమాత్రంగా నాలుగైదు శాతానికో తగ్గించటం ఎందుకు చేయలేదు?

ఇప్పుడేదో తెగ అన్యాయం జరిగినట్లుగా మాట్లాడుతున్న జగన్.. తన తండ్రి హయాంలోనూ దాదాపు ఇలాంటి భారాన్నే జనాల మీద మోపారన్న విషయాన్ని మర్చిపోకూడదు. విభజన కారణంగా పడిన లోటును పూడ్చుకునేందుకు బాబు సర్కారు రూ.4 వ్యాట్ ను మాత్రమే అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి. విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయం మీద అదే పనిగా పోరాటాలు చేసి.. కేంద్రం నుంచి సాయం అందేలా జగన్ ప్రయత్నించి ఉంటే.. ఇలాంటి రూ.4 భారం లేకుండా ఉండేది. ఆ దివంగత మహానేత హయాంలో చేయలేని పనిని చంద్రబాబు చేయగలరంటారా జగన్..?
Tags:    

Similar News