కొంతమందిపై కొందరు వేసే మాటలు బాగా పేలుతుంటాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎటకారంగా విమర్శలు చేయాలన్నా.. నిప్పులు చెరిగేలా మాట్లాడాలన్నా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మించినోళ్లు ఉండరు. గడిచిన కొద్దిరోజులుగా ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబును తన మాటలతో తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెడుతున్న జగన్.. తాజాగా అనంతపురంలోని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రైతు మహా ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయటమే కాదు.. ఎటకారంతో ఆయన వేసిన పంచ్ లు ఓ రేంజ్ లో పేలాయి.
జగన్ ప్రసంగంలోని కీలకాంశాల్ని చూస్తే..
= మిట్ట మధ్యాహ్నం ఎండ మండుతున్నా.. కరవుతో కడుపు కాలుతున్నా..వచ్చిన మీ అందరికి శిరస్సు వంచి మరీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తోంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేశారు. మరో 3 లక్షల ఎకరాలు మిగిలిన పంటలు వేశారు. వేరుశనగ పంటలో 90 శాతం ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రాయలసీమ నాలుగు జిల్లాల్లో దాదాపు 21.50లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు. 17 లక్షలకు పైగా ఎకరాల్లో పంట ఎండిపోయింది. జూన్ లో వర్షాలు పడ్డాయి కాబట్టి ఈసారైనా బయట పడగలమని అనుకున్నాం. అందుకే మామూలు కన్నా ఎక్కువగా ఈసారి పంట వేశాం. కానీ జులైలో చాలీచాలని వర్షాలు పడితే.. ఆగస్టులో ఒక్క బొట్టు వర్షం కూడా పడలేదు. దీంతో 90 శాతం పంట నష్టపోవాల్సి వచ్చింది.
= ఇలాంటి దారుణ పరిస్థితులు ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 28న కదిరి.. పుట్టపర్తికి వచ్చారు. కరవు ఉందా? నాకు తెలీదే.. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎవరూ చెప్పలేదే అంటారు. తన కంప్యూటర్ లోని డాష్ బోర్డులో ప్రతి రోజు ఎక్కడ.. ఎంత వర్షం పడిందో తెలుసని చెప్పే ముఖ్యమంత్రి వర్షం పడని విషయం.. కరవు ఉందన్న విషయం ఎందుకు తెలీలేదు? నీ కోర్ డాష్ బోర్డు పనిచేయడం లేదా..? కంప్యూటర్లు పనిచేయడం లేదా.. వాటిని నొక్కడానికి నీ చేతులు రావట్లేదా ?
= ఆగస్టు 6.. 15 తేదీల్లో అనంతపురం జిల్లాకు వచ్చి రెండు మీటింగులు పెట్టారు. ఒక్క ఎకరా పంట కూడా ఎండనివ్వబోనన్నాడు. వెంటనే రెయిన్ గన్ పేరుతో ఒక సినిమా తీయడం మొదలుపెట్టాడు. ఇది జరిగిన నాలుగు రోజులకు కరవును జయించేశాం.. తరిమి కొట్టేశామన్నారు. నోరు తెరిస్తే ఇన్ని అబద్ధాలు ఆడుతున్న ఈ వ్యక్తికి నిజంగా రెయిన్ గన్ అంటే ఏంటో తెలుసా అని అనుమానం వచ్చింది . ఎందుకంటే రెయిన్ గన్లు ఇప్పుడు ఈయన కొత్తగా కనిపెట్టినవి కావు.. ఎప్పటినుంచో ఉన్నాయి.
= కరువు రావడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. కానీ కరువు వచ్చినపుడు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా స్పందించాలో ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. గతంలో కరువు వచ్చినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా పట్టించుకున్నారో గుర్తు తెచ్చుకోండి. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు పోవాలంటే తానేం చేయాలి - కేంద్రం చేత ఏం చేయించాలని ఆలోచనలు చేశారు . ఆ ఆలోచనల నుంచి పుట్టిన తొలి సంతకమే.. ఉచిత విద్యుత్. బోరు వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతులకు అది తోడుగా నిలబడింది . తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తోచలేదు.. పైగా రైతులను పోలీసు స్టేషన్లలో పెట్టారు . వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1100కోట్ల రైతుల విద్యుత్ బకాయిలను ఒక్క సంతకంతో మాఫీ చేశారు.
= అంతటితో ఆగకుండా.. కేంద్రం దగ్గరకు వెళ్లి ఇక్కడ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో జయతి ఘోష్ నివేదిక చూపించారు . రైతు ఆత్మహత్యలను నివారించడానికి ఒక విధానం రూపొందించాలని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు మాదిరిగా అర్జీ ఇచ్చి ఊరుకోలేదు.. కేంద్రం మీద ఒత్తిడి తేవడంతో కేంద్రం ఒక కమిటీని నియమించింది. రాష్ట్రంలోనే కాక దేశంలో 2001 నుంచి 2004 వరకు కరువు వల్ల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని అధ్యయనం చేసింది. దేశం మొత్తమ్మీద 31 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలనికేంద్రం ఆమోదించింది. వాటిలో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 16 జిల్లాలు వచ్చాయి. ఆ ప్యాకేజి వచ్చిన తర్వాత ఏళ్ల తరబడి రైతులంతా కట్టాల్సిన వడ్డీలను పూర్తిగా మాఫీ చేశారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు రుణాలు రెన్యువల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అందరికీ మళ్లీ కొత్త రుణాలివ్వాలని రాజశేఖరరెడ్డి కృషివల్ల కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
= ఇప్పుడు వరుసగా మూడో సంవత్సరం కూడా కరవు వచ్చింది. కరువొస్తే కనీసం ఆ విషయాన్ని గుర్తించి, ఒప్పుకొని రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ - పంటబీమా ఇవ్వాలని ఆలోచించాల్సి ఉండగా.. కరువు వచ్చినట్లే తనకు తెలియదన్న చంద్రబాబు, తనకెవరూ చెప్పలేదంటారు. పైగా ఇదే చంద్రబాబు.. నాలుగు రోజుల్లోనే కరువును జయించేశామని ప్రకటనలు ఇచ్చేస్తాడు. ముఖ్యమంత్రుల మధ్య తేడా ఏంటో ఇక్కడే అర్థమవుతుంది . చంద్రబాబు 2013-14లో ఎన్నికల ప్రచారంలో కరువు గురించి ఊదరగొట్టాడు. సీఎం అయిన తర్వాత ఇన్‌పుట్ సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టాడు. కేంద్రం ఇచ్చిన వెయ్యి కోట్లను కూడా వేరేవాటికి వాడుకున్నాడు. 2014 - 15లో 692 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని కూడా కొంతవరకు ఎగ్గొట్టాడు. రైతుల నోట్లో పూర్తిగా మట్టికొట్టాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/