నాకు క‌క్కుర్తి లేదు క‌సి ఉంది- జ‌గ‌న్‌

Update: 2017-11-06 08:19 GMT

ప్ర‌జా సంక‌ల్ప‌ పాద‌యాత్ర సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. నాన్నగారి పేరు నిలబెట్టేలా.. జగన్‌ అంతే మంచోడని పేరు తెచ్చుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. త‌న‌కు కాసులంటే కక్కుర్తి లేదు...కేసులంటే భయపడనని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. `నాకుండేది కసి. చనిపోయిన తర్వాత కూడా పేదవాడి గుండెల్లో బతకాలనే కసి ఉంది. విడిపోయిన ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని నమ్ముతున్నా ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించాలి. వ్యవసాయాన్ని పండగ చేయాలి.  రాబోయే మూడేళ్లలో మద్యపానం నిషేధించాలి. డబ్బుల్లేక చదువులు ఆగకూడదు. మళ్లీ చదువుల విప్లవం తేవాలి డబ్బుల్లేక చదువులు ఆగకూడదు. నేను పోయిన తర్వాత నాన్నగారి ఫొటో పక్కనే నా ఫొటో ఉండాలి.`` అనే క‌సితో  తాను ముందుకు సాగుతున్న‌ట్లు జ‌గ‌న్ వివ‌రించారు.

చంద్రబాబు హయాంలో ఏ ఒక్క సామాజిక వర్గానికి మేలు జరగలేదని జ‌గ‌న్ ఆక్షేపించారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు అధికారాలు లేవని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధుల్లేవని జ‌గ‌న్ గుర్తు చేశారు. అధికారం ఉన్నదల్లా జన్మభూమి కమిటీలనే దొంగల ముఠాలకు అని ఆరోపించారు.జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు పెత్త‌నం అప్ప‌గించ‌డంపై జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా దేవరకొండ బాల గంగాధర్‌ తిలక్ సూక్తుల‌ను ఉటంకించారు. ``గ‌జానికొక గాంధారి కొడుకు గాంధీ పుట్టిన దేశంలో.. అన్నమాట చంద్ర‌బాబు పాల‌న‌లో నిజమైందని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం... ఉన్నాయా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. త‌మ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్టు కొన్నారని అందులో నుంచి నలుగురిని మంత్రులను చేశారని జ‌గ‌న్ పేర్కొన్నారు. జంపింగ్‌ ల‌ను ప్రొత్స‌హించిన బాబుకు ఎన్నికలు పెట్టే ధైర్యం లేదని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. నంద్యాల్లో బలమా వాపా తేలాలంటే.... దమ్ముంటే 20 చోట్ల ఒకేసారి ఎన్నికలు పెట్టాల‌ని స‌వాల్ విసిరారు. `తహసీల్దార్‌ ని కొడితే కేసులండవ్‌.. రిషితేశ్వరి చనిపొతే న్యాయం జరగదు..విజయవాడలో ఆయన కళ్ల ముందే సెక్స్‌ రాకెట్‌ జరిగితే కనిపించదు``అంటూ జ‌గ‌న్ నిప్పులు చెరిగారు.

చంద్రబాబు పాలనలో చీఫ్‌ సెక్రటరీగా ఉన్న పెద్దాయన రోజుకో స్కాం బయటపెడుతున్నాడని జ‌గ‌న్ గుర్తు చేశారు.  రాష్ట్రంలో ఏ పరిశ్రమ జరిగి ఆయను 30 శాతం లంచాలు ముట్టాల్సిందేన‌ని ఆయ‌న‌ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం వలనే రాష్ట్రానికి దుర్గతి పట్టిందని జ‌గ‌న్ అన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలిచ్చిన సలహాలతో ప్రజలు దిద్దిన మ్యానిఫెస్టో రూపొందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అధికారంలోకి మ్యానిఫెస్టోను ఖచ్చితంగా ఖచ్చితంగా అమలు చేసి తీరుతామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.
Tags:    

Similar News