ఆ 19 నియోజ‌క‌వ‌ర్గాల‌పైనేనా జ‌గ‌న్ దృష్టి!

Update: 2022-08-30 08:01 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోమారు ఘ‌న‌విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారు. త‌న వ్యూహ‌, ప్ర‌తివ్యూహాల‌ను ప‌దునుపెడుతున్నారు. ఈసారి 175కి 175 సీట్లు సాధించాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీకి మొత్తం 151 సీట్లు ద‌క్కాయి. టీడీపీ కేవ‌లం 23 సీట్ల ద‌గ్గ‌ర ఆగిపోయింది. ఇక ఒక స్థానం జ‌న‌సేన పార్టీకి ల‌భించింది.

ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు, వైఎస్సార్సీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. వ‌ల్ల‌భ‌నేని వంశీమోహన్ (గ‌న్న‌వ‌రం), మ‌ద్దాల గిరిధ‌ర్ (గుంటూరు ప‌శ్చిమ‌), క‌ర‌ణం బ‌ల‌రాం (చీరాల‌), వాసుప‌ల్లి గణేష్ కుమార్ (విశాఖ‌ప‌ట్నం సౌత్) వైఎస్సార్సీపీతో అంట‌కాగుతున్నారు. క‌ర‌ణం బల‌రాం, వాసుప‌ల్లి గణేశ్ ఇద్ద‌రూ త‌మ కొడుకుల‌ను వైఎస్ఆర్సీపీలో చేర్పించారు. ఈ న‌లుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీతో అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున రాజోలు నుంచి గెలిచిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కూడా వైఎస్ఆర్సీపీతోనే అంట కాగుతున్నారు. అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతున్నారని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇక టీడీపీకి మిగిలిన 19 మంది ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌గ‌న్ దృష్టి సారించార‌ని చెబుతున్నారు. రేప‌ల్లె, పాల‌కొల్లు, పెద్దాపురం, కుప్పం, అద్దంకి, ఉండి, ప‌ర్చూరు, విజ‌య‌వాడ తూర్పు, రాజ‌మండ్రి రూర‌ల్, రాజ‌మండ్రి సిటీ, మండ‌పేట‌, టెక్క‌లి, ఇచ్చాపురం, ఉర‌వ‌కొండ‌, కొండెపి, హిందూపురం, విశాఖ‌ప‌ట్నం తూర్పు, విశాఖ‌ప‌ట్నం ప‌శ్చిమం, విశాఖ‌ప‌ట్నం ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సీట్ల‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగుర‌వేయ‌డానికి అప్పుడే కార్యాచ‌ర‌ణ ప్రణాళిక‌ను వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించార‌ని చెబుతున్నారు. త‌ద్వారా 175కి 175 సీట్ల‌ను సాధించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో పంచాయ‌తీ, మండ‌ల ప‌రిష‌త్, జిల్లాప‌రిష‌త్, మున్సిపాలిటీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల‌ను వైఎస్సార్సీపీనే గెలుచుకుంది. దాదాపు 90కి పైగా స్థానాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించ‌డం సులువేన‌ని వైఎస్సార్సీపీ లెక్క‌లేసుకుంటోంది.

అయితే ఈ 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితులే ఉన్నాయ‌ని.. వైఎస్సార్సీపీ మ‌రోసారి ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో చిత్త‌వ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌గ‌న్ మాత్రం త‌న బ‌ట‌న్ నొక్కుడు ప‌థ‌కాలే గెలిపిస్తాయ‌నే ఆశ‌తో ముందుకు క‌దులుతున్నారు. అంతేకాకుండా ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీలో బ‌ల‌మైన నేత‌లంద‌రినీ వైఎస్సార్సీపీలోకి తాయిలాల ఆశ చూపి లాగారు. కొంద‌రికి ప‌దవులు, మ‌రికొంద‌రికి భారీగా డ‌బ్బు ముట్టింద‌ని చెప్పుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News