జగన్ కి సమస్య కాదలచుకోలేదు...వారంతా ఏంటి...?

Update: 2022-04-13 09:41 GMT
ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ విస్తరణ చేసిన తరువాత గతంలో ఎన్నడూ లేని తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే అస్మదీయులు, తస్మదీయులు గా కధ తయారైంది. నిన్నటి దాకా చెల్లెమ్మా అని అప్యాయంగా పిలిస్తే పలికిన వారే ఇపుడు అడ్డం తిరిగారు. జగన్ మీద ఈగ వాలితే తమ మీద కొండ పడిపోయినంతగా బాధపడిన వారే సైడ్ అయిపోతున్నారు.

ఇక మంత్రి వర్గ విస్తరణ తరువాత ఆశావహుల అలకలు ఎన్నడూ లేనంతగా పీక్స్ లోకి వెళ్ళిపోయాయి. వాళ్లను బుజ్జగించడానికి జగన్ టీమ్ లు వెళ్తే కొన్ని చోట్ల సక్సెస్ అవుతోంది. కొందరు ఇంకా అలకపానుపు వీడడంలేదు. మరో వైపు  చూస్తే జగన్ తో భేటీ అయిన వారు కూడా బయటకు నవ్వుతున్నా మనసు బాధతో మూలుగోందని ఫేస్ ఇండికేటర్ మీడియాకు క్లారిటీగా చెప్పేస్తోంది.

ఇవన్నీ ఇలా ఉంటే స్పీకర్ తమ్మినేని సీతారామ్ దీని మీద తాజాగా చేసిన సంచలన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను జగన్ కి సమస్య కాదలచుకోలేదు అందుకే మంత్రి వర్గం రేసులో ఉన్నా తానే తప్పుకున్నానని చెప్పుకున్నారు. తనకు కూడా మంత్రి కావాలని ఉందని, అయితే జగన్ ఇబ్బందులు చూసి తానే స్వచ్చందంగా తప్పుకున్నాను అని తమ్మినేని అంటున్నారు.

మంత్రివర్గ విస్తరణ అన్నది అంత ఈజీ కాదని, ఎన్నో సమీకరణలు ఉంటాయని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఇక తనకు తొలి దఫాలో మంత్రికి బదులుగా స్పీకర్ పదవి ఇవ్వాలని జగన్ భావించారని, నాడు ఆయన ఆ పదవి విషయం తనతో చెప్పడానికి ఇబ్బంది పడుతూంటే తానే ఓకే చెప్పి హ్యాపీగా స్పీకర్ ని అయ్యాను అని తమ్మినేని చెప్పారు.

మొత్తానికి చూస్తే తమ్మినేని ఏపీ మంత్రి వర్గం కూర్పు శభాష్ అని మెచ్చుకున్నారు. అదే టైమ్ లో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. తమ్మినేని పెద్ద మనిషి, ఎన్నో ఏళ్ల క్రితమే మంత్రిగా అయ్యారు. ఆయనకు ఏ పదవులూ కొత్త కాదు, కానీ తాను సీఎం కి సమస్య కాదలచుకోలేదు అని ఆయన అన్నారూ అంటే మరి సీఎం కి సమస్యగా మారిన వారు ఎవరు అన్న చర్చ కూడా వస్తోంది.

ఒక విధంగా తమ్మినేని చెప్పినది కరెక్ట్ గా ఉన్నా వైసీపీలో పదవులు ఆశించి భంగపడిన వారిలో కొందరు సమస్యలు క్రియేట్ చేస్తున్నారు అన్న బాధ అయితే పార్టీలోనే ఉంది. దాని వల్లనే తమ్మినేని ఈ కామెంట్స్ చేశారా అన్న చర్చ వస్తోంది. మొత్తానికి తమ్మినేని స్పీకర్ గానే మరో రెండేళ్ళు కొనసాగడానికి ఫుల్ ప్రిప్రేర్డ్ గా ఉన్నారు. సో ఆయన వరకూ ఓఅకే. జగన్ కి కూడా ఆయనతో హ్యాపీ. అంత వరకూ చూస్తే నో ప్రాబ్లెం.
Tags:    

Similar News