ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీకి పూనుకున్నారు. ఈ సందర్భంగా ఓ లేడీ ఎమ్మెల్యేకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమెకు భర్తకు కీలకమైన పదవి ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సెక్రటరీ / సీఈవోగా రాయలసీమ ప్రాంతానికి చెందిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త అయిన ఆలూరు సాంబశివారెడ్డిని ఏపీ ప్రభుత్వం తాజాగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా సదురు లేడీ ఎమ్మెల్యే పద్మావతి ఆమె భర్త సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి మరీ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సెల్ఫీ దిగి జగన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తనకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆలూరు సాంబశివారెడ్డి.
ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడారు.. ముఖ్యమంత్రి జగన్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. జగన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపేందుకు తాను వచ్చానని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో విద్యా యజ్ఞం చేస్తోందని.. దాన్ని తాను అందరి సహకారంతో పూర్తి చేస్తానని సాంబశివారెడ్డి తెలిపారు.